logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

దుబ్బాక ఎన్నికల ఫలితాలను కేసీఆర్ ముందే ఊహించారా ?

దుబ్బాక ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ అధికార పార్టీనే కాకండా ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ స్వల్ప ఆధిక్యం కనబరిచినప్పటికీ విజయం మాత్రమే తమనే వరిస్తుందనే ధీమా టిఆర్ఎస్ నేతల్లో కనిపించింది. అయితే ఊహించని విధంగా దుబ్బాక ప్రజలు బీజేపీకి పట్టం కట్టడంతో ఇప్పుడు అధికార పక్ష నేతలు సందిగ్ధంలో పడ్డారు.

అయితే ప్రజల తీర్పుపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. మరి ఈ ఓటమిపై కేసీఆర్ స్వరం ఎలా ఉంటుందనే విషయం ఇప్పుడు అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. గెలుపై అందరికన్నా ఎక్కువగా ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎలా స్పందిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచార ప్రకారం దుబ్బాకలో ఓటమిని కేసీఆర్ రెండు గంటల ముందే ఊహించారట.

దీంతో ఆయన ఆగ్రహంతో పాటుగా విస్మయానికి గురైనట్టుగా తెలుస్తుంది. అంతే కాదు అప్పటివరకు విజయం మనదే అంటూ అంచనాలు వేసిన అధికారులపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారట. అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని భావిస్తున్నారట.

Related News