logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో రామోజీరావుకు టెన్ష‌న్.. ఆ ప‌ని చేస్తే రామోజీకి క‌ష్టాలే

టాలీవుడ్ ప్ర‌ముఖ హీరోలు చిరంజీవి, నాగార్జున తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌లిశారు. హైద‌రాబాద్ వ‌ర‌ద బాధితుల కోసం చిరంజీవి కోటి రూపాయ‌లు, నాగార్జున యాభై ల‌క్ష‌ల రూపాయ‌ల సాయాన్ని వారు కేసీఆర్‌కు అందించారు. నిజానికి వీరి కేసీఆర్‌ను క‌లిసిన ఉద్దేశ్యం ఇదే అయినా హైద‌రాబాద్‌లో చిత్ర పరిశ్ర‌మ‌ను మ‌రింత అభివృద్ధి చేసే దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రిగాయి. చిరంజీవి, నాగార్జున ఊహించ‌ని విధంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నుండి చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి ఓ భారీ హామీ ల‌భించింది.

హైద‌రాబాద్ శివార్ల‌లో అంత‌ర్జాతీయ స్థాయిలో ఫిల్మ్‌ సిటీని నిర్మిస్తామ‌ని కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. ఇందుకు గానూ 1500 ఉంచి 2000 ఎక‌రాల స్థ‌లాన్ని సైతం కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. బ‌ల్గేరియాకు వెళ్లి అక్క‌డి ఫిల్మ్‌ సిటీని ప‌రిశీలించి, హైద‌రాబాద్‌లో ఫిల్మ్‌ సిటీ నిర్మాణానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని ఆయ‌న చిరంజీవి, నాగార్జున‌తో పాటు అధికారుల‌కు సూచించారు. షూటింగ్‌ల‌తో పాటు సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సౌక‌ర్యాల‌ను ఇక్క‌డ క‌ల్పిస్తామ‌ని కేసీఆర్ తెలిపారు.

అధునాత‌న సాంకేతిక‌, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా అంత‌ర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీని నిర్మిస్తామ‌ని, ఇందులో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినీ నిర్మాణ సంస్థ‌ల‌కు స్థ‌లం కేటాయిస్తామ‌ని, అన్ని మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని కేసీఆర్ హామీలు ఇచ్చారు. ముఖ్య‌మంత్రి వ‌ద్ద నుంచి ఊహించ‌ని ఈ హామీలు రావ‌డంతో చిరంజీవి, నాగార్జున కూడా చాలా సంతోష‌ప‌డ్డారు.

అయితే, కేసీఆర్ ఈ ప్ర‌క‌ట‌న రామోజీరావుకు మాత్రం ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశం ఉంది. ఎందుకంటే రామోజీరావు హైదరాబాద్ శివార్ల‌లో సుమారు 1500 ఎక‌రాల‌తో ఇప్ప‌టికే రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించారు. ఫిల్మ్ సిటీ నిర్మించ‌డం రామోజీరావు క‌ల‌. ఇంత పెద్ద స్థ‌లంలో ఫిల్మ్ సిటీ నిర్మించ‌డం పెద్ద లాభ‌సాటి వ్యాపారం కాక‌పోయినా ఆయ‌న త‌ను అనుకున్న‌ట్లుగా ఫిల్మ్ సిటీ నిర్మించారు. ఇప్పుడు దాదాపుగా 80 శాతం తెలుగు సినిమాల షూటింగ్ ఎంతోకొంత రామోజీ ఫిల్మ్ సిటీలో అవుతుంది.

రామోజీ ఫిల్మ్ సిటీకి గిన్నీస్ బుక్‌లో కూడా చోటు ల‌భించింది. రామోజీ ఫిల్మ్ సిటీ మిన‌హా హైద‌రాబాద్‌లో కొన్ని ఫిల్మ్ స్టూడియోలు ఉన్నాయి కానీ అవి ఫిల్మ్ సిటీతో పోల్చిన‌ప్పుడు చాలా చిన్న‌వి. కాబ‌ట్టి, రామోజీ ఫిల్మ్ సిటీకి పోటీ అనేదే లేదు. కానీ, ఇప్పుడు ప్ర‌భుత్వమే ఫిల్మ్ సిటీ నిర్మించాల‌నే ఆలోచ‌న‌ను తెర‌పైకి తీసుకురావ‌డం రామోజీ ఫిల్మ్ సిటీకి ఇబ్బందిక‌రంగా మార‌వ‌చ్చు. భ‌విష్య‌త్‌లో ప్ర‌భుత్వం నిర్మించే ఫిల్మ్ సిటీ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి పోటీ ఉండ‌వ‌చ్చు.

కేసీఆర్ చేసిన ఫిల్మ్ సిటీ ప్ర‌క‌ట‌న కార్య‌రూపం దాలిస్తే మాత్రం రామోజీ రావుకు వ్యాపార‌ప‌రంగా ఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణ‌కు గ‌ర్వ‌కార‌ణమ‌ని గ‌తంలో కేసీఆర్ చెప్పారు. ఫిల్మ్ సిటీలో ద‌ళితుల అసైన్డ్ భూములు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌ను కూడా కేసీఆర్ ఖండించి రామోజీ రావుకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఫిల్మ్ సిటీలో ఎటువంటి అక్ర‌మాలు జ‌ర‌గ‌లేదని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

అంతేకాదు, రామోజీరావు కొత్త‌గా హైద‌రాబాద్‌లో 3 వేల ఎక‌రాల్లో 4 వేల కోట్ల వ్య‌యంతో ఓం సిటీ పేరుతో ఆధ్యాత్మిక న‌గ‌రాన్ని నిర్మించ‌బోతున్నార‌ని, ఇది హైద‌రాబాద్‌లో ఒక గొప్ప సంస్థ అవుతుంద‌ని కేసీఆర్ చెప్పారు. కానీ ఓం సిటీ ప్ర‌తిపాద‌న అక్క‌డికే ఆగిపోయింది. ఓం సిటీ నిర్మించాల‌నే రామోజీరావు ఆలోచ‌న‌కు ఎందుకు బ్రేకులు ప‌డ్డాయి. ఇప్పుడు ప్ర‌భుత్వ‌మే ఫిల్మ్ సిటీ నిర్మించాల‌నే ఆలోచ‌న‌కు రావ‌డంతో రామోజీ ఫిల్మ్ సిటీకి కూడా పోటీ ఎదురుకాబోతోంది. మొత్తంగా కేసీఆర్‌తో చిరంజీవి, నాగార్జున భేటీ రామోజీరావును మాత్రం టెన్ష‌న్ పెట్టేలా ఉంది.

Related News