logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్

దేశంలో ముంబై, చెన్నై తరువాత అతి పెద్ద సినీ పరిశ్రమ ఉన్నది హైద్రాబాదులోనే అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా చితికిపోయిన పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సినీ పెద్దలు చిరంజీవి, నాగార్జున, సహా టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు కలిసి ఆదివారం రోజున ప్రగతి భవన్ లో సీఎంతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కరోనా, లాక్ డౌన్ తర్వాత పరిశ్రమ ఎదుర్కుంటున్న సమస్యల గురించి వివరించారు. కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు తరలి రావడానికి ఎనో చర్యలు తీసుకుంటున్న తమ ప్రభుత్వం.. సినీ పరిశ్రమను కాపాడుకోలేకపోతే ఎలా అన్నారు. లక్షలాది మంది మందికి తెలుగు పరిశ్రమ ఉపాథి కల్పిస్తుందన్నారు.

ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని సినీ పెద్దలు కోరగా అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. కోవిడ్ కారణంగా నష్టపోయిన పరిశ్రమను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రభుత్వంతో పాటుగా సినీ పెద్దలు కూడా తమ వంతుగా దీనిపై కృషి చేయాలన్నారు. రానున్న జీహెచ్ఎంసీ మానిఫెస్టోలో కూడా అందుకు సంబదించిన అంశాలను ప్రస్తావిస్తాం అని కేసీఆర్ తెలిపారు.

తర్వాత చిరంజీవి ఇంట్లో మరోసారి భేటీ అయ్యి ఈ అంశాలపై విస్తృతంగా చర్చినాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన అధికారి సోమేశ్ కుమార్ తో పాటుగా సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కేఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి కళ్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News