logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాలు ఎంత ప‌దునుగా ఉంటాయో ఆయ‌న వ్య‌తిరేకుల‌కే బాగా తెలుసు. ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ ఈట‌ల రాజేంద‌ర్‌. త‌న‌ను విభేదించి భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి వెళుతున్న ఈట‌ల రాజేంద‌ర్‌పై కేసీఆర్ దృష్టి పెట్టారు. ఈట‌ల రాజేంద‌ర్ హుజురాబాద్‌లో బ‌ల‌మైన నాయకుడు. ఆరుసార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలిచిన నేత‌. నిజానికి ఆయ‌న హుజురాబాద్‌లో అంత బ‌ల‌మైన నేత‌గా ఎద‌గ‌డానికి కార‌ణ‌మే టీఆర్ఎస్‌, తెలంగాణ ఉద్యమం. ఈట‌ల రాజేంద‌ర్ ఉన్న‌న్ని రోజులు ఇక్క‌డ టీఆర్ఎస్‌లో మ‌రో నేత ఎవ‌రూ నియోజ‌క‌వ‌ర్గ‌స్థాయి ఎద‌గ‌లేదు.

దీంతో టీఆర్ఎస్‌కు ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించ‌డం అంత సులువు కాదు. కేసీఆర్ స్వ‌యంగా దృష్టి పెడితేనే ఈట‌ల‌కు చెక్ పెట్ట‌గ‌ల‌రు. ఇప్పుడు కేసీఆర్ అదే ప‌నిలో ఉన్నారు. హుజురాబాద్‌లో ఈట‌ల‌ను ఓడించి ఆయ‌న‌కు, బీజేపీకి క‌లిపి ఒకేసారి షాక్ ఇవ్వాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఇందుకోసం మంత్రులు హ‌రీష్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్‌ను రంగంలోకి దింపారు. హుజురాబాద్ చుట్టుప‌క్క‌ల నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా కొంత ప‌ని అప్ప‌గించారు.

దీంతో ఈటల రాజేంద‌ర్‌కు హుజురాబాద్‌లో వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఏళ్లుగా గులాబీ జెండా మోసి, ఆ జెండాతోనే రాజ‌కీయంగా ఎదిగిన టీఆర్ఎస్ శ్రేణులు చాలా వ‌ర‌కు ఆ పార్టీలోనే, కేసీఆర్ నాయ‌క‌త్వంతోనే ఉండాల‌ని డిసైడ్ అవుతున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఈట‌ల వెంట ఉన్న వారు కూడా ఇప్పుడు టీఆర్ఎస్‌లోనే ఉంటామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. ఇలా ఈట‌ల క్యాడ‌ర్ ఇప్ప‌టికే స‌గం వ‌ర‌కు ఆయ‌న‌కు దూర‌మైంది.

అయితే, క్యాడ‌ర్ దూర‌మైనా కూడా ప్ర‌జ‌ల్లో ఈట‌ల ప‌ట్ల కొంత సానుకూల‌త ఉండే అవ‌కాశం ఉంది. దీనిపై కూడా కేసీఆర్ దృష్టి పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ ద్వారానే, త‌న ప్రోత్సాహంతోనే ఈట‌ల రాజ‌కీయంగా ఎదిగార‌ని, ఆయ‌న‌కు అనేక అవ‌కాశాలు ఇచ్చామ‌నే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని కేసీఆర్ టీఆర్ఎస్ నేత‌ల‌ను ఆదేశించారు. అంతేకాదు, హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు కేసీఆర్ ఒక మాస్ట‌ర్‌స్ట్రోక్ కొట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటు స‌మ‌యంలో హుజురాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ వ‌చ్చింది. హుజురాబాద్ జిల్లా సాధ‌న స‌మితి ద్వారా ఉద్య‌మం జ‌రిగింది. కానీ, అప్పుడు జిల్లా ఏర్ప‌డ‌లేదు. ఇప్పుడు హుజురాబాద్‌లో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని చాలా ప్రాంతం వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా ప‌రిధిలో ఉంది. వ‌రంగ‌ల్ అర్బ‌న్‌తో పాటు రూర‌ల్ జిల్లా కేంద్రాలు వ‌రంగ‌ల్ న‌గ‌రంలోనే ఉన్నాయి.

ఇలా ఉండ‌టం ద్వారా అభివృద్ధి అంతగా విస్త‌రించ‌డం లేదు. దీంతో వ‌రంగ‌ల్ అర్బ‌న్‌, రూర‌ల్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లో కొన్ని మార్పులు చేసి హుజురాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. జిల్లాల సంఖ్య పెర‌గ‌కుండా హుజురాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాట‌య్యే అవ‌కాశం ఉంది. ఈ జిల్లాకు పీవీ న‌ర‌సింహ‌రావు పేరు పెట్ట‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించ‌డంతో పాటు అభివృద్ధి అవకాశాల‌ను మెరుగుప‌ర‌చ‌వ‌చ్చు. ఈట‌ల‌ను రాజ‌కీయంగా దెబ్బ‌తీయ‌వచ్చు. పీవీ న‌ర‌సింహారావుకు కూడా స‌రైన గౌర‌వం ఇచ్చిన‌ట్లు అవుతుంది.

Related News