logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

సోషల్ మీడియా ట్రోలింగ్ పై కేసీఆర్ ఫైర్..?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొందరు ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ ఆకస్మిక సమావేశం ఏర్పాటు చేసారు. ప్రగతి భవన్ వేదికగా దాదాపు 5 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం.

దుబ్బాక ఉప ఎన్నికలు నిరాశ పరచడం పట్ల కేసీఆర్ స్పందించారు. దుబ్బాక ఫలితాలను చూసి అధైర్యపడవలసిన అవసరం లేదు. గాలివాటు గెలుపుకు భయపడేది లేదు. మన దగ్గర పటిష్ట యంత్రాంగం ఉంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చాం. ఈ ఐదేళ్లలో దాదాపు రోడ్లు, మౌలిక వసతుల కల్పనకురూ. 5 వేల కోట్ల నిధులను ఖర్చు చేసాం.

2016 గ్రేటర్ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా మనదే విజయం. తమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అందుకు డివిజన్ల వారీగా పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ సమన్వయ పరుచుకోవాలని నేతలకు సూచించారని సమాచారం. కాగా సోషల్ మీడియాలో తమ పార్టీ పై జరుగుతున్న ట్రోలింగ్ పై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది.

ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ నాయకులూ, అభ్యర్థులు, కార్యకర్తల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతూ, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దేనని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.

Related News