logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

హైద‌రాబాద్ నుంచే వ్యాక్సిన్‌..? ప్ర‌ధానితో కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు..!

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం, లాక్‌డౌన్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న అభిప్రాయాల‌ను తెలియ‌జేశారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఎంత‌కాలం ఉంటుందో తెలియ‌ని ప‌రిస్థితి ఉన్నందున క‌రోనాతో క‌లిసి జీవించేలా యాక్ష‌న్ ప్లాన్ రూపొందించాల‌ని కేసీఆర్ సూచించారు. జులై లేదా ఆగ‌స్టులో హైద‌రాబాద్ నుంచే వ్యాక్స‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉందని కేసీఆర్ పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది.

రేప‌టి నుంచి రైలు స‌ర్వీసులు పున‌రుద్ధ‌రించ‌డం స‌రికాద‌ని ఆయ‌న‌ మోడీకి స్ప‌ష్టం చేశారు. రైళ్ల‌ను అనుమ‌తించ‌డం ద్వారా చాలా ఇబ్బందులు ఉంటాయ‌ని, ముఖ్య ప‌ట్ట‌ణాల్లో ఎక్కువ కేసులు న‌మోద‌వుతున్నందున ఆయా ప‌ట్ట‌ణాల మ‌ధ్య‌ రైళ్ల‌ను పున‌రుద్ధ‌రించ‌డం వ‌ల్ల కొత్త స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. రైళ్ల ప్ర‌యాణికుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, క్వారంటైన్‌లో సాధ్యం కాద‌ని అన్నారు.

అన్ని రాష్ట్రాల ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా కేసీఆర్ ప్ర‌స్తావించారు. రాష్ట్రాల‌కు ఉన్న అప్పులు రీషెడ్యూల్ చేయాల‌ని ఆయ‌న కోరారు. లాక్‌డౌన్ కార‌ణంగా రాష్ట్రాల‌కు ఆదాయం పూర్తిగా త‌గ్గిపోయినందున ఉద్యోగుల‌కు జీతాలు కూడా ఇచ్చే ప‌రిస్థితి కూడా లేద‌ని పేర్కొన్నారు. ఎఫ్ఆర్‌బీఎం ప‌రిధి పెంచి రాష్ట్రం కొత్త‌గా అప్పులు తెచ్చుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు. వ‌ల‌స కార్మికుల‌ను సొంత రాష్ట్రాల‌ను అనుమ‌తించాల‌ని కేసీఆర్ సూచించారు.

Related News