logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

పెళ్లికూతురైన సీఎం కేసీఆర్ దత్త పుత్రిక.. పెళ్ళికి హాజరుకానున్న ప్రముఖులు!

పినతల్లి చేతిలో చిత్ర హింసలకు గురయ్యి, కన్న తండ్రి ఆదరణ లేక కొన్నేళ్ల పాటు నరకం అనుభవించిన ప్రత్యూష చావు అంచుల దాకా వెళ్లి వచ్చింది. చివరకు సీఎం కేసీఆర్ చొరవతో ఆమె బతికి బట్టగట్టింది. ప్రత్యూషను కేసీఆర్ దంపతులు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న ఆమె ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది. కాగా ఇప్పుడు ఆమె ఓ ఇంటిది కాబోతుంది. రాంనగర్ ప్రాంతానికి చెందిన జైన్ మేరీ, మర్రెడ్డి దంపతులు కుమారుడు చరణ్‌రెడ్డితో డిసెంబర్ 28న ప్రత్యూష వివాహం జరగనుంది.

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామం మేరీమాత దేవాలయంలో క్రైస్తవ సంప్రదాయంలో ప్రత్యూష పెళ్లి జరగనుంది. గతంలో సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళా అభివృద్ధి శాఖా, శిశు సంక్ష్మ శాఖ అధికారులు ఆమె బాధ్యతను తీసుకున్నారు. కాగా ఈరోజు బేగంపేటలోని ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ గెస్ట్‌హౌజ్‌లోప్రత్యూష పెళ్లికూతురు వేడుక జరిగింది.

ఈ వేడుకకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ సంక్షేమ శాఖ సంచాలకులు కేఆర్‌ఎస్‌ లక్ష్మీదేవి, సునంద, గిరిజ, శారద, హైదరాబాద్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మోతి తదితరులు పాల్గొని మంగళ వాయిద్యాల నడుమ ఆమె పెళ్లి కూతురు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇక రేపటి వివాహ వేడుకకు కూడా పలువురు మంత్రులు, అధికారులు హాజరు కానున్నారని సమాచారం.

 

Related News