logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

అనుకోకుండా జరిగింది.. అర్థం చేస్కోండి: కేసీఆర్ విజ్ఞప్తి

తెలంగాణలో పాత సచివాయలం భవనాల కాల్చివేతపై ఇప్పటికే ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మరో చిక్కు వచ్చి పడింది. పాత భవనాలు కూలుస్తున్న సమయంలో సచివాలయం ప్రాంగణంలో ఉన్న ప్రార్థనా మందిరాలపై శిథిలాలు విరిగి పడి అవి పాక్షికంగా కొంత దెబ్బతిన్నాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటన బాధించిందన్నారు. దీనిపై విచారం వ్యక్తం చేసారు.

ఇలా జరిగి ఉండవలసింది కాదు. కానీ తమ ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా సరే దెబ్బతిన్న ప్రార్థనా మందిరాల స్థానంలో అంతకంటే పెద్ద విస్తీర్ణంలో మళ్ళీ దేవాలయం, మసీదులను తిరిగి నిర్మించి ఇస్తుందన్నారు. దేవాలయ, మసీదుల నిర్వాహకులతో త్వరలోనే సమావేశమవుతామన్నారు. సెక్యులర్ రాష్ట్రమైన తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో లౌకిక వాదాన్ని కొనసాగిస్తుందన్నారు. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసారు.

Related News