logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

‘హీరోలు, దర్శకులకు ఆమె అనుకూలవతి’.. కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణాది సినిమా, ప్రేక్షకులపై హీరోయిన్ పూజ హేగ్దే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడి వారికి హీరోయిన్ల నడుము అందాలు, తొడలు అంటే పిచ్చి అంటూ చేసిన వ్యాఖ్యలపై పూజపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ కు దిగారు నెటిజన్లు. ఇదిలా ఉండగా సినీ విమర్శకుడు కత్తి మహేష్ పూజ హేగ్దెను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

“అవును… పూజా హెగ్డే చెప్పింది నిజమే కదా! మనకి తొడలు, బొడ్డు అంటే అబ్సెషన్ కదా!! దానికి సిగ్గెందుకూ? పూజా హెగ్డేని మాత్రం ఆవిడ భీభత్సమైన నటన చూసా మన దర్శకులు రిపీట్ చేస్తోంది? ఎదో చూడ్డానికి బొంబాయి మోడల్ లా ఉంటుంది. రూపవతి పైగా అనుకూలవతి మరియు గగనజఘనవతి అనేకదా?!?” అంటూపూజ హేగ్దే పై సంచలన వ్యాఖ్యలు చేశాడు కత్తి మహేష్.

అయితే అనుకూలవతి అంటే ఎవరు అని బివిఎస్ రవి ప్రశ్నించగా హీరోలు, దర్శకులకు అనుకూలంగా నడుచుకునేవారు అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ తో రెచ్చిపోయాడు కత్తి మహేష్. మరో నెటిజన్ గగనజగవతి అంటే ఏమిటి? అని అడగగా నడుము లేనిది అంటూ సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Related News