logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌

రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ క‌నిపిస్తోంది. గ‌తంలో కాంగ్రెస్ నుంచి నాయ‌కులు వేరే పార్టీల‌కు వెళ్లే వార్త‌లే వ‌చ్చేవి. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిక‌ల‌కు సంబంధించిన వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్, యాంక‌ర్‌, జ‌ర్న‌లిస్టు క‌త్తి కార్తీక కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే ఆమె టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ మ‌ధుయాష్కి గౌడ్‌ను క‌లిసి ఈ విష‌యంపై చ‌ర్చించారు.

త్వ‌ర‌లోనే ఆమె రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ యాస‌లో ఆక‌ట్టుకునేలా వార్త‌లు చెప్ప‌డం, ఇంట‌ర్వ్యూలు చేయ‌డంలో క‌త్తి కార్తీక స్పెష‌ల్‌. అందుకే ఆమెకు త్వ‌ర‌గా ప్ర‌జ‌ల్లో బాగా గుర్తింపు ల‌భించింది. టీఆర్ఎస్ నేత‌, డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్‌కు కూడా క‌త్తి కార్తీక బంధువు. చాలాకాలంగా క‌త్తి కార్తీక రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆస‌క్తిగా ఉన్నారు.

దుబ్బాక‌లో జ‌రిగిన ఉప ఎన్నిక ద్వారా ఆమె త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఆమె స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా పోటీ చేశారు. తాను స్థానికురాలిన‌ని, స్థానిక స‌మ‌స్య‌ల‌న్నీ త‌న‌కు తెలుస‌ని చెబుతూ ఆమె ప్ర‌చారం కూడా చేశారు. కానీ, రెండుపార్టీల మ‌ధ్య జ‌రిగిన హోరాహోరీ పోరులో క‌త్తి కార్తీక నిల‌వ‌లేక‌పోయారు. దుబ్బాక‌లో ఓడిన త‌ర్వాత ఆమె భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరాల‌ని భావించారు.

ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిని కూడా ఆమె క‌లిశారు. ఇంత‌కాలం తెలంగాణ‌లో బీజేపీ ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా మారుతుంద‌నే అంచ‌నాలు ఉన్న నేప‌థ్యంలో క‌త్తి కార్తీక బీజేపీ వైపు చూశార‌ని తెలుస్తోంది. కానీ, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ మ‌ళ్లీ బ‌లోపేతం అవుతుంద‌ని భావిస్తున్న ఆమె ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాల‌ని దాదాపుగా నిర్ణ‌యం తీసుకున్నారు.

Related News