టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో హీరో నిఖిల్ ఒకడు. ‘హాపీ డేస్’ సినిమాతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నిఖిల్ ఆ తరువాత హీరో అవతారమెత్తాడు. సోలో హీరోగా నిఖిల్ నటించిన ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ సినిమాలు నిఖిల్ ను టాలీవుడ్ లో మంచి హీరోగా నిలబెట్టాయి. ఇటీవల ఓ ఇంటివాడైన ఈ యంగ్ హీరో త్వరలో కార్తికేయ సినిమా కు సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్ డాఎం కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో లాక్ డౌన్ సడలిస్తున్న సమయంలో ఏ హీరో చెయ్యని సాహసం చేస్తున్నాడు నిఖిల్. కార్తికేయ సినిమాకు సంబందించిన విదేశీ షెడ్యూల్ ను పూర్తి చేస్తామంటున్నారు సినిమా టీమ్. అందుకోసం ఈస్ట్ ఆసియా దేశానికి లొకేషన్ల అనుమతుల కోసం వెళ్లనున్నారట.
కంబోడియా పరిసరాల్లోని రీస్ ప్రాంతంలో కార్తికేయ సినిమాకు సంబందించిన కీలక సీన్లను షూట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా సినీ పరిశ్రమ తల్లకిందులవుతున్న సమయంలో కార్తికేయ టీమ్ చేస్తున్న ఈ డేరింగ్ ఫీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.