logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

కోరుకున్నవారితో పెళ్లి జరగాలంటే కార్తీకమాసంలో శివుడిని ఇలా పూజించండి

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసం. శివుడు అభిషేక ప్రియుడు. . శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది. కార్తీకంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. అరణ్యంలో పూసిన పూలంటే ఆయనకు మహా ఇష్టం. ఈ మాసంలో శివుడిని వివిధ రకాల పూలు, పత్రాలతో పూజిస్తే విశిష్ట ప్రయోజనాలు కలుగుతాయి.

అయితే శివుడి పూజకు వాడే పూలు వాడిపోకూడదు. ఇతరుల ఇల్లు, పూల తోటల నుంచి రహస్యంగా తెచ్చిన పూలతో శివుడిని పూజించకూడదు. అలాగే కీటకాలు కొరికిన పూలు పూజకు పనికిరావు. కార్తీకమాసంలో శివుడిని పాలతో అభిషేకించి జాజి పూలతో పూజించిన వారికి శివుడిని దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుంది.

శివుడిని రోజూ తెల్ల జిల్లేడు పూవులతో అర్చించిన వారికి బంగారం దానం చేసినంత ఫలం దక్కుతుంది. ధనప్రాప్తి కావాలనుకునే వారు మహా శివుడిని గన్నేరు పూలతో పూజించాలి. వివాహితులు గులాబీ పూలతో స్వామిని పూజిస్తే సౌభాగ్యం కలుగుతుంది. సంతానం కోరుకునే దంపతులు మల్లె పూలతో స్వామిని అర్చించాలి.

బిల్వ పత్రాలను శివుడి ముందు ఉంచి పూజిస్తే సకల దరిద్రాలు తొలిగి సుఖ శాంతులు కలుగుతాయి. కోరుకున్న కన్యను భాగస్వామిగా పొందాలనుకునే పురుషులు సన్నజాజి పూలతో కార్తీక మాసంలో శివుడిని ఆరాధించాలి. స్త్రీలు వెండి, రాగి బిల్వాలతో కార్తీక పౌర్ణమి రోజున శివుడిని పూజిస్తే సర్వగుణ సంపన్నులు భర్తగా లభిస్తారని పురోహితులు చెప్తున్నారు.

మారేడు దళాన్ని శివ లింగానికి తాకిస్తే, ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందనల ప్రభావం ఆ దళంలో చాలా సేపు నిలిచి ఉంటుంది. అలాంటి మారేడు దళం మీరు రోజంతా మీ జేబులో, హృదయానికి దగ్గరగా ఉంచుకొని చూడండి. అది మీ శారీరక స్థితినీ, మానసిక స్థితినీ కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది’ అంటారు సద్గురు జగ్గీ వాసుదేవ్.

 

 

 

Related News