logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ప్రేమ పెళ్లికి కుటుంబం బలి.. కత్తులతో గొంతుకోసి మారణహోమం

ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఆ యువకుడు తన కుటుంబం మొత్తాన్ని కోల్పోవలసి వచ్చింది. కుటుంబంలో ఒక్కరు కూడా మిగలకుండా అమ్మాయి కుటుంబం సృష్టించిన మరణ హోమానికి యువకుడి కుటుంబం, తోడబుట్టిన వాళ్ళు బలయ్యారు. ఊహించని ఈ పరిమాణంతో ఆ గ్రామమంతా ఉలిక్కిపడింది. ఎటు చూసినా రక్తపు దారాలతో భయానక వాతావరణం నెలకొంది.

పోలీసుల కథనం ప్రకారం.. రాయచూరు జిల్లా సింధనూరుకు చెందిన మౌనేష్(25) అదే గ్రామానికి చెందిన మంజుల(22)తో ప్రేమలో పడ్డాడు. ఒకే కులం అయినా వీరిద్దరి పెళ్ళికి మంజుల కుటుంబం అడ్డుచెప్పడంతో ఆరు నెలల క్రితం మౌనేష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కూతురు చేసిన పనికి ఆమె తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు. అల్లుడి కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు.

ఇటీవల తన తండ్రి అంబణ్ణ రెండో వివాహం చేసుకున్నాడని తెలిసిన మంజుల ఆస్తిలో తనకు రావలసిన వాటా దక్కదేమోనన్న భయంతో తండ్రి వద్దకు వెళ్ళింది. తన వాటా తనకు పంచాలని కోరింది. ప్రేమ పెళ్లి చేసుకోవడమే కాకా తన ఆస్తిలో వాటా కావాలని వచ్చిన కూతురిని చూసి ఆ తండ్రి కోపం తీవ్ర స్థాయికి చేరుకుంది. కూతురిపై దుర్భాషలాడి అల్లుడి కుటుంబం అంతు చూస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన మంజుల భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది.

అప్పటికే ఆమె తండ్రి అంబణ్ణ అన్నంత పనీ చేసాడు. మరో ఇద్దరిని వెంటబెట్టుకుని కత్తులు, కొడవళ్ళతో కూతురు అత్తగారింటికి వెళ్ళాడు. ఆ కుటుంబంలో కనిపించిన వారిని కనిపించినట్టుగా కత్తులతో విరుచుకుపడ్డారు. దొరికిన వారందరినీ గొంతు కోసి విచక్షణారహితంగా హత్య చేసాడు. ఈ హత్యాకాండలో మౌనేష్‌ అన్న నాగరాజు(38), అక్క శ్రీదేవి (30), పెద్దన్న హనుమేష్‌ (40), తల్లి సుమిత్ర (55) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఇక తండ్రి వీరప్ప(65), రేవతి (20), తాయమ్మ (25) గాయాల పాలయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతమంతా భీభత్సంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మౌనేష్ దంపతులకుకూడా ప్రాణహాణి ఉండటంతో వారికీ కట్టుమిట్టమైన భద్రతా ఏర్పాటు చేసారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు.

Related News