logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

అత్యాచారం జరిగాక నిద్రపోయానన్న బాధితురాలు.. హై కోర్టు సంచలన వ్యాఖ్యలు!

అత్యాచార బాధితురాలిపై బుధవారం కర్ణాటక హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం జరిగాక అలిసిపోయి నిద్రపోయానన్న బాధితురాలి వివరణను కోర్టు కొట్టిపారేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ కృష్ణ తీర్పు వెల్లడిస్తూ.. ఏ మహిళ కూడా తనకు ఇంతటి దారుణం జరిగిన తరువాత, తన జీవితం నాశనం అయ్యిందన్న తరువాత ఈ విధంగా స్పందించదు. ముఖ్యంగా భారతీయ మహిళలు ఎవ్వరూ ఇలా స్పందించరు అంటూ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజేష్ కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. అదే విధంగా బెయిలు మంజూరు చేసినందుకు గల కారణాలను కూడా కోర్టు తీర్పు నివేదికలో పొందుపరిచారు. రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలు నిందితుడి గదికి ఎందుకు వెళ్లిందో వివరించడంలో విఫలమయిందన్నారు.

అంతేకాదు అర్థరాత్రి అతనితో కలిసి మద్యం సేవించడానికి కూడా ఆమె అభ్యంతరం తెలపలేదు అని వ్యాఖ్యానించింది. కాగా కర్ణాటకకు చెందిన బాధితురాలు రాజేష్ అనే వ్యక్తి కంపెనీలో రెండేళ్లుగా ఉద్యోగం చేస్తుంది. ఈ సమయంలో తనకు పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజేష్ తనపై అత్యాచారణకి ఒడిగట్టాడని చెప్పి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు హై కోర్టు ముందు హాజరుపరిచారు.

Related News