logo

  BREAKING NEWS

భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |  

శాసనమండలిలో రభస: డెప్యూటీ ఛైర్మెన్ కు ఘోర అవమానం!

కర్ణాటక శాసన మండలి రసాభాసగా మారింది. మండలిలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో కొందరు సభ్యులు ఛైర్మెన్ పోడియంను చుట్టుముట్టారు. ఛైర్మెన్ స్థానంలో సభను నడిపిస్తున్న డిప్యూటీ ఛైర్మెన్ ను కాంగ్రెస్ సభ్యులు కుర్చీ నుంచి బయటకు లాక్కొచ్చారు.

ఈ ఘటనతో మండలిలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎవరికి నచ్చినట్టుగా వారు మాటాడుతూ సభ నియమాలను ఉల్లంఘించారు. దీంతో మార్షల్స్ రంగంలోకి దిగి సభ్యులను అడ్డుకున్నారు. బీజేపీ, జేడీఎస్ సభ్యులు కలిసి ఒకరిని ఛైర్మెన్ స్థానంలో అక్రమంగా కుర్చోబెట్టారని కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. ఇదే సమయంలో సభలో సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. సభ్యులు ఒకరినొకరు బయటకు నెట్టేసుకున్నారు.

ఛైర్మెన్ సభను అదుపుచేయలేకపోతున్నారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. అలాంటప్పుడు ఛైర్మెన్ ఉండి లాభమేమిటని వారు ప్రశ్నించారు. వెంటనే అయన ఆ స్థానంలో నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేసారు. శాసన మండలిలో బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తుందని తీవ్ర విమర్శలు చేసారు.

Related News