logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

‘కరణం మల్లీశ్వరి’ దర్శకురాలికి అస్వస్థత..!

ఒలంపిక్ విజేత, ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి బయోపిక్ ను తెరకెక్కిస్తున్నటుగా ప్రకటించి సంచలనం సృష్టించారు ద్రర్శకురాలు సంజనా రెడ్డి. కాగా ఇటీవల ఈమె తీవ్ర అస్వస్థకు గురయ్యారని, ఆసుపత్రిలో చేరి చికిత్స అందుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

సంజనా రెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో హఠాత్తుగా కళ్ళు తిరిగిపడిపోయారు. ఆమె పెంపుడు కుక్క అరవడంతో ఇంటి వాచ్ మెన్ ఆమెను ఆసుపత్రిలో చేర్పించారట. గత కొన్ని రోజులుగా స్ట్రిక్ట్ డైట్ ను పాటిస్తున్నందువల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయి అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఆమె వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని త్వరలోనే కోలుకుని ఆసుపత్రి నంచి డిశ్చార్జ్ అవుతారని రచయిత కోన వెంకట్ తెలిపారని సమాచారం.

కాగా కోన వెంకట్ కారణం మల్లీశ్వరి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తాహున్న విషయం తెలిసిందే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన సంజనా రెడ్డి రాజ్ తరుణ్ నటించిన ‘రాజు గాడు’ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది.

Related News