logo

  BREAKING NEWS

ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు పాక్ ప‌ని ఖ‌త‌మ‌య్యేదా ?  |   కంటిచూపు త‌గ్గుతోందా ? ఈ చిన్న చిట్కాలు పాటించండి  |   గూగుల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది.. మీకు కావాలా ?  |   బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  |   మళ్లీ పాత పార్టీలోకే విజ‌య‌శాంతి  |   మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి అంద‌రి అభిమాన సింగ‌ర్‌  |   క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |  

ప్రముఖ సినీ నటిపై అత్యాచారం.. పరారీలో నిందితులు

పుట్టిన రోజు వేడుకల పేరుతో ఇంటికి పిలిచి నటికి మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. అంతే గాక ఆ వీడియోలను చిత్రీకరించి బెదిరింపులకు గురి చేసాడు. తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు తన తండ్రితో కలిసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగుళూరులోని జేజే నగర్ కు చెందిన కన్నడ నటి ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటుంది.

ఇటీవల ఆమెకు ఓ కాఫీ షాపులో నాయండహళ్లికి చెందిన మోహిత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను ఓ ప్రముఖ కంపెనీకి సీఈవోగా పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన కంపెనీని ప్రమోట్ చేయాలనీ నటితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో గోవాకు తీసుకెళ్లి ఆమెపై ఫోటో షూట్ కూడా నిర్వహించాడు. ఈ సమయంలో ఆమె వద్ద వివిధ కారణాలు చెప్పి లక్షన్నరకు పైగా తీసుకున్నాడు.

కాగా ఓ రోజు తన పుట్టిన రోజు వేడుకల్ని చెప్పి ఆమెను తన నివాసానికి పిలిపించుకున్నాడు. ఆ రోజు భోజనం చేసిన తర్వాత ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆమె స్పృహ తప్పడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని వీడియో తీసి అనంతరం అశ్లిల సైట్లలో పెడతానంటూ ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో బాధితురాలి వద్ద 11 లక్షలు తీసుకున్నాడు.

తాజాగా మరో 9 లక్షలు లాగాడు. బాధితురాలిని బెదిరించి ఆమెపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి వేధింపులు తట్టుకోలేకపోయిన ఆమె ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడు మోహిత్ తో పాటుగా అతని తల్లిదండ్రులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రస్తుతం ఈ కుటుంబం పరారీలో ఉండగా వారికోసం గాలిస్తున్నారు.

Related News