logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

జ‌గ‌న్‌పై క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌శంస‌లు

విశాఖ‌ప‌ట్నంలోని ఎల్జీ పాలిమ‌ర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘ‌ట‌న‌లో బాధితుల‌ను బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప‌రామ‌ర్శించారు. బీజేపీ నేత‌లు సోము వీర్రాజు, మాధ‌వ్‌, విష్ణుకుమార్‌రాజుతో క‌లిసి ఆయ‌న విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించి, ఘ‌ట‌న గురించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాల‌ని భ‌రోసా ఇచ్చారు.

అనంత‌రం క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ… గ్యాస్ లీకేజ్ ఘ‌ట‌న బాధాక‌ర‌మ‌న్నారు. గ్యాస్ లీకేజ్ దుర్ఘ‌ట‌న‌లో బాధితుల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కోటి రూపాయ‌ల ప‌రిహారం ప్ర‌క‌టించ‌డం అభినంద‌నీయ‌మ‌ని, స్వాగ‌తించాల్సిన విష‌య‌మ‌న్నారు. ఈ ప్ర‌క‌ట‌న కేవ‌లం విశాఖ‌ప‌ట్నం ప్ర‌జ‌ల‌కే కాకుండా రాష్ట్ర కార్మికలోకానికి కూడా ఒక భ‌రోసా నింపింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ప్ర‌భుత్వం స్పందించిన తీరు బాగుంద‌న్నారు.

ఈ ఘ‌ట‌న‌పై జ్యుడీషియ‌ల్ విచార‌ణ జ‌ర‌పాలని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ డిమాండ్ చేశారు. పిల్ల‌లు ఈ ఘ‌ట‌న‌లో ఎక్కువ‌గా బాధితులుగా ఉన్నార‌ని, ప్ర‌మాద‌క‌ర గ్యాస్ పీల్చ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్‌లోనూ వారికి ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. కాబ‌ట్టి, నిపుణులైన వైద్య సిబ్బందితో పిల్ల‌లకు చికిత్స జ‌రిపించాల‌ని, వారి ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాల‌ని ఆయ‌న సూచించారు.

Related News