logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

డబ్బుల కోసమే వెంటపడ్డానన్నాడు.. ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నాడు

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి తన మాజీ ప్రియుడిపై తీవ్రంగా విరుచుకుపడింది. సినీ పరిశ్రమలోకి వచ్చిన తొలి నాళ్లలో తనకు ఎలాంటి లక్ష్యాలు ఉండేవి కావన్నారు. ఎప్పుడైతే మాజీ ప్రియుడితో వివాదాలు ఏర్పడ్డాయో అప్పుడే తనకు తన స్థానం గుర్తుకు వచ్చిందన్నారు. ఒక సమయంలో అతని వల్ల లీగల్ కేసులు ఎదుర్కొన్నాను. ఆనాడు జరిగిన చర్చలు నాకు ఇంకా గుర్తున్నాయి. తనను ప్రేమ పేరుతో మోసం చేసాడని చేసిన ఫిర్యాదుకు వారు తన కుటుంబ నేపథ్యాన్ని అవమానించారని చెప్పుకొచ్చింది.

నేను ఒక మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయిని. అందుకే డబ్బుల కోసమే అతని వెంట పడ్డానని నన్ను నిందించారు. ఈ సమాజం అంతా నా లాంటి అమ్మాయిలను అదే కోణంలో చూస్తారు. నాకు డబ్బు, ఆస్తులపై ఏనాడు ఆశ లేదు. కానీ నా మాజీ ప్రియుడు చేసిన ఆరోపణల కారణంగా నన్ను అందరూ డబ్బుల కోసమే అతని వెంట పడ్డట్టుగా చూసారు.

ఇదే విషయాన్నీ హ్రితిక్ రోషన్ తన స్నేహితుల వద్ద కూడా చెప్పాడు. కానీ నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలి ఆరోజు నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఆ రోజు సొంత ఇల్లు కూడా లేని నేను నా సొంత శక్తితో ఎదిగి ఈరోజు సొంత ఇళ్లు, కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాను. నన్ను నిందించిన నా మాజీ ప్రియుడు మాత్రం అద్దె ఇంట్లో ఉంటున్నాడు అంటూ కంగనా వ్యాఖ్యానించింది.

Related News