logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

షాకింగ్: కంగనా లవర్, సుశాంత్ ను చంపింది ఒక్కడేనా..?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కింది. ఇటీవల బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఎంతటి సంచలనమైందో తెలిసిందే. ఆనాటి నుండీ కంగనా స్పీడ్ పెంచింది. బాలీవుడ్ లోని చీకటి కోణాలను బయటపెడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

తనకు ఒక పనికిమాలిన లవర్ ఉండేవాడని వాడే ఇదంతా చేస్తున్నాడని ఫైర్ అయ్యింది. ఇటీవల ట్విట్టర్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుందన్న కారణంగా ట్విట్టర్ కంగనా అకౌంట్ పై ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటుంది. అయితే కొంత కాలంగా కంగనాకు ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. ఈ విషయంపై స్పందిస్తూ కంగన ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేందుకే కొందరు ఇదంతా చేస్తున్నారని మండిపడింది.

”వాడు ఒక్క పిల్లను కూడా పెళ్లి చేసుకోడు. ఎందుకంటే వాడి బీరువా నిండా లెక్కలేనన్ని అస్థిపంజరాలు ఉంటాయి. మనం సంతోషంగా ఉంటె వాడి మాఫియా చూడలేదు. వాడే సుశాంత్ ను కూడా ఫినిష్ చేసాడు. త్వరలోనే ఆధారాలతో సహా మీ ముందుకు వస్తా”నని ట్విట్టర్ ద్వారా పేర్కొంది కంగనా.

Related News