logo

  BREAKING NEWS

ఆ అలవాటు వల్లే అతని భార్య వదిలేసింది.. నేను డేటింగ్ చేశా: కంగనా

బాలీవుడ్ ఫైర్ బ్రామ్డ్ కంగనా రనౌత్ మరో బాంబు పేల్చింది. కంగనా కొన్నేళ్లుగా బాలీవుడ్ చీకటి కోణం గురించి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరో సుశాంత్ మరణంతో ఈ పోరాటాన్ని ఆమె మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో కంగనా తన సొంత ప్రయోజనాల కోసమే సుశాంత్ మరణాన్ని వాడుకుతుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

అయితే ఇటీవల ఈ కేసులో రియా చక్రబర్తికి డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. రియా డ్రగ్ డీలర్లతో జరిపిన చాట్ ఒకటి బయటకు రావడంతో సంచలనంగా మారింది. ఇప్పుడు దీనిపై కంగనా మరోసారి గొంతు బాలీవుడ్ పై విరుచుకుపడింది. బాలీవుడ్ లో 99 శాతం హీరోహీరోయిన్లు డ్రగ్స్ తీసుకునే వారేనని వీరంతా ప్రైవేటు పార్టీల్లో డ్రగ్స్ సేవిస్తారని షాకింగ్ కామెంట్స్ చేసింది. వీళ్లందరిపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని పేర్కొంది.

అందుకు తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను ఉదాహరించింది. ఓ స్టార్ హీరో కూడా డ్రగ్స్ కు బానిసయ్యాడని ఆ కారణం వల్లే అతని భార్య విడాకులిచ్చి వదిలించుకుందని తెలిపింది. అతని కుటుంబంలో డ్రగ్స్ కారణంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని ఆ తర్వాత అతను నాతో డేటింగ్ చేసాడని చెప్పుకొచ్చింది. అలాగే బాలీవుడ్ లో తనకు గురువుగా చెప్పుకునే ఓ బడా నిర్మాత తనకి మొదట్లో ఓసారి డ్రగ్స్ రుచి చూపించాడని చెప్పింది. ఇక ఆ మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ అని.. ఆమె చెప్తున్నా బడా నిర్మాత మహేష్ భట్ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కంగనా వ్యాఖ్యలు మరోసారి సంచలనానికి తెర తీశాయి.

Related News