logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మీ నాన్న వల్లే ‘పోకిరి’ సినిమా వదులుకున్నా: కంగనా 

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నిర్మాత మహేష్ భట్ కూతురు పూజ భట్ మధ్యన వివాదం రోజురోజుకు ముదురుతోంది. బాలీవుడ్ లో నేపోటిజం పై ఎప్పటి నుంచో కంగనా తన గొంతు వినిపిస్తుంది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత కంగనా ఈ విషయంపై మరింత మండిపడుతుంది. ఆమె ధాటికి కరణ్ జోహార్, మహేష్ భట్ లాంటి వారి కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో పడిందని అంటున్నారు.

అయితే కంగనా మహేష్ భట్ పై చేస్తున్న విమర్శలకు ఆయన పెద్ద కూతురు, అలియా భట్ సోదరి పూజ భట్ ఘాటుగానే సమాధానం ఇస్తుంది. కంగనా మొదటి సినిమా ‘గ్యాంగ్ స్ట’ర్ తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాకు నిర్మాతలు మహేష్ భట్ సోదరుడు ముకేశ్ భట్. ఆ సినిమా విజయం సాధించడంతో పాటు కంగనా నటనకు అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో అవార్డు తీసుకున్న కంగనా మహేష్ భట్ ను కౌగలించుకుని ధన్యవాదాలు తెలిపింది.

ఇప్పుడు ఈ వీడియోను పూజ భట్ షేర్ చేస్తూ కంగనా అప్పట్లో ఇలా వ్యవహరించేది అంటూ విమర్శించింది. అందుకు కంగనా బదులిస్తూ..గ్యాంగ్ స్టర్ సినిమా కోసం నేను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయాల్సిన ‘పోకిరి’ సినిమాను వదులుకోవలసి వచ్చింది. ఆ సినిమా నా కెరీర్ కు చాలా ఉపయోగపడేది. మీ నాన్న వల్ల నాకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది అని కౌంటర్ ఇచ్చింది.

Related News