logo

  BREAKING NEWS

ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు పాక్ ప‌ని ఖ‌త‌మ‌య్యేదా ?  |   కంటిచూపు త‌గ్గుతోందా ? ఈ చిన్న చిట్కాలు పాటించండి  |   గూగుల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది.. మీకు కావాలా ?  |   బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  |   మళ్లీ పాత పార్టీలోకే విజ‌య‌శాంతి  |   మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి అంద‌రి అభిమాన సింగ‌ర్‌  |   క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |  

పెద్దలు విడదీశారని.. టిక్ టాక్ వీడియో చేసి ఆత్మహత్య!

ప్రియురాలి ఎడబాటు భరించలేకపోయిన ఓ యువకుడు చనిపోతున్నానంటూ టిక్ టాక్ వీడియో చేసి ప్రేయసికి పంపాడు. ఆ తర్వాత నిమిషుల వ్యవధిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిమ్మక్ పల్లికి చెందిన సాయవ్వ, నారాయణ దంపతుల కుటుంబం కొన్నేళ్ల క్రితం కామారెడ్డికి వచ్చారు.

ఆర్థిక ఇబ్బందులతో నారాయణ కొన్నేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆ తర్వాత వారి ముగ్గురు కుమారులు హైదరాబాద్ నగరానికి వచ్చి పని చేసుకుంటూ బతుకుతున్నారు. చిన్న కుమారుడు సంతోష్ (22) నగరంలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతను అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కాగా ఈ విషయం ఇటీవల యువతి తల్లిదండ్రులకు తెలియయడంతో సంతోష్ ను మందలించి యువతిని వరంగల్ కు తీసుకెళ్లిపోయారు.

అయినా సంతోష్ యువతిని మర్చిపోలేకపోయాడు. కొంత కాలం ప్రయురాలితో రహస్యంగా ఫోన్లో మాట్లాడుకుంటూ కాలం గడిపారు. కాగా ప్రియురాలు దూరమైందన్న మనస్తాపం చెందాడు. నువ్వు లేకుండా బతకలేనని, చనిపోతున్నానంటూ ఆమెకు టిక్ టాక్ వీడియో చేసి పంపాడు. ఆ తరువాత కొద్ది నిమిషాలకే తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News