కరోనా వైరస్ కారణంగా దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. జీవనోపాథి కోల్పోయి సగం మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ. 100 కోట్లతో పార్లిమెంట్ భవనం నిర్మించడం అవసరమా? అంటూ మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ మోదీ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద మొత్తం రూ. 20, 000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ కోర్టు ఉత్తర్వులు జరీ చేసింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసారు.
చైనా గోడ కూలి వేలాది మంది ప్రజలు చనిపోతే ప్రజలను రక్షించడానికే ఈ గోడ కట్టామంటూ ఆనాటి పాలకులు చెప్పుకొచ్చారు. మరి మోడీ రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ పార్లిమెంట్ భవనం ఎవరిని రక్షించడానికి కడుతున్నారంటూ కమల్ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కమల్ సన్నద్ధమవుతున్నారు.
అందులో భాగంగానే మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మరోవైపు తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పలువురిని పార్టీలో చేర్చుకుంది. ఇటీవల నటి కుష్బూ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. నిరుద్యోగం, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, అవినీతి అంశాలే ప్రధాన అజండాగా కమల్ ఈ ఎన్నికల్లో ముందుకెళుతున్నారు.