logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

కాజల్ పెళ్లిలో ఊహించని సీన్.. తెలుగు ప్రేక్షకులు ఫిదా

దక్షణాది సినీ తార కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహమాడారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన గౌతమ్ కశ్మీరీ కాగా కాజల్ అగర్వాల్ సొంత రాష్ట్రం పంజాబ్. దీంతో వీరి వివాహం పంజాబీ, కశ్మీరీ పద్ధతుల్లో జరిగింది. అయితే వీరి వివాహ వేడుకలో ఊహించని ఓ సన్నివేశం కాజల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు.

ఈ ఫొటోల్లో ఒకటి వధూవరులు తలపై జీలకర్ర- బెల్లం పెట్టుకుంటున్నది పోస్ట్ చేసారు. ఈ విధంగా తెలుగు ప్రేక్షకులు, ఇక్కడి సంప్రదాయాలపై తన అభిమానాన్ని చాటుకున్నారు కాజల్. అంతే కాదుజీలకర్ర- బెల్లం విశిష్టతను తెలుపుతూ ఈ పోస్ట్ ను తెలుగులో రాయడంతో ఆమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

హిందీ సహా పలు దక్షణాది భాషలో నటించిన కాజల్ కు తెలుగులో లభించినంత గుర్తింపు మరే భాషలో రాలేదు. ఇక్కడ ఆమె సినిమాలకు విపరీతమైన అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వివాహ ఘట్టంలో కాజల్ ఈ విధంగా తన అభిమానాన్ని తెలియజేయడంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News