logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కాజల్ బెల్లంకొండ మధ్య ఏం నడుస్తుంది?

మీడియాలో వచ్చే కొన్ని రూమర్స్ పూర్తిగా అబద్దాలని అనుకుంటే పొరపాటే అవుతుంది. గతంలో సమంత- నాగ చైతన్య ప్రేమలో ఉన్నారనే వార్తలు బాగా వినిపించేవి. ముందు వీటిని ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుని అభిమానులకు నిజంగానే షాకిచ్చారు. ఇప్పుడు మరో టాలీవుడ్ జంట కూడా నేడో రేపో బాంబు పేల్చడానికి రెడీ అవుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. వారెవరో కాదు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ యంగ్ హీరో బెల్లంకొండ సురేష్. వీరిద్దరూ ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటున్నారు నెటిజన్లు.

వీరిద్దరి వ్యవహారం చూస్తుంటే కూడా అలాగే ఉంది. బెల్లం కొండకు కాజల్ అంటే క్రష్ అని ఎప్పటి నుంచో రూమర్స్ ఉన్న సంగతి తెలిసిందే. కానీ కాజల్ ఈ రూమర్స్ ను అంతగా పట్టించుకోకపోవంతో ఆమె ఫాన్స్ కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఇటీవల వీరిద్దరూ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. వీరి సంభాషణ గమనించిన వారంతా వీరిద్దరి మధ్య అసలు ఏం నడుస్తుందనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి కవచం, సీత అనే రెండు సినిమాల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

కాజల్ దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. కానీ ఎవరితోనూ ఈ కుర్ర హీరోతో ఉన్నంత క్లోజ్ గా కనిపించలేదు. ఒక వేళ ఉన్నా అనవసరమైన రూమర్లకు భయపడి సోషల్ మీడియాలో బయటపడే అవకాశం లేదు. కానీ తాజాగా కాజల్ చేసిన ఓ పోస్ట్ చూస్తే వీరిద్దరి స్నేహం మరింత ముందుకు వెళ్లినట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మూడు నెలలుగా వీరిద్దరి మధ్య ఎడబాటు వచ్చిందేమో. అందుకే కాజల్ ఓ పోస్ట్ చేస్తూ.. నిన్ను చాలా మిస్సవుతున్నాను. వెంటనే చూడాలని ఉందంటూ బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి తీసుకున్న ఫోటోలు షేర్ చేసింది.

అందుకు మన హీరో కూడా ఘాటు గానే రిప్లై ఇచ్చాడు. ‘నైనేతే ఇంకా మిస్‌ అవుతున్నా. కానీ కలవడానికి వీలు లేని పరిస్థితుల్లో ఇలా చెప్పకు’ అని పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు నెటిజన్లు వీరిపై ప్రశ్నల వర్షం కురిపిసున్నారు. అసలు మీ సంగతేంటి? మీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారా? పెళ్ళెప్పుడు చేసుకుంటారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే కాజల్ తన 35వ పుట్టిన రోజు జరుపుకుంది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వారు కూడా ఒత్తిడి చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని కాజల్ నిర్ణయించుకుందట. అదే సమయంలో బెల్లం కొండ శ్రీనివాస్ తో ఈమె వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై క్లారిటీ రావాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

Related News