logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

కోహ్లీనా..? రోహిత్ శ‌ర్మ‌నా ? మాజీ క్రికెట‌ర్ కైఫ్ ఆస‌క్తిక‌ర స‌మాధానం

టీమిండియా క్రికెట‌ర్ల‌లో వేగంగా పరిగెత్తేది ఎవ‌రు అని అడిగిన ప్ర‌శ్న‌కు మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పాడు. క్రికెట‌ర్లు అంద‌రిలో వికెట్ల మ‌ధ్య వేగంగా ప‌రిగెత్తేది ధోనీనే అని ఆయ‌న చెప్పాడు. వ‌య‌స్సు అనేది కేవ‌లం ఒక నెంబ‌ర్ మాత్ర‌మేన‌ని ధోనీ నిరూపించాడ‌ని, ఇప్ప‌టికీ అదే వేగం కొన‌సాగిస్తున్నాడ‌ని చెప్పుకొచ్చాడు. మొద‌ట్లో ధోనీ వేగం చూసి ఆశ్చ‌ర్య‌పోయాన‌ని చెప్పాడు. కాగా, ధోనీ త‌న మొద‌టి వ‌న్డే మ్యాచ్‌లో ర‌నౌట్ అయ్యాడు. అప్పుడు ధోనీ అవ‌త‌లి వైపు కైఫ్ ఉండ‌టం గ‌మ‌నార్హం. వీరిద్ద‌రి మ‌ధ్య ఆ మ్యాచ్‌లో స‌మ‌న్వ‌యం కుద‌ర‌క ధోనీ ర‌నౌట్ అయ్యాడు.

కాగా, టీమిండియా బ్యాట్స్‌మెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ గురించి కూడా కైఫ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒకవేళ ఒకే స‌మ‌యంలో కోహ్లీ, రోహిత్ శ‌ర్మ వేర్వేరు మ్యాచ్‌లు ఆడుతుంటే ఎవ‌రి ఆట చూస్తార‌ని అడిగిన ఓ ప్ర‌శ్న‌కు రోహిత్ ఆట చూస్తాన‌ని కైఫ్ స‌మాదాన‌మిచ్చారు. విరాట్ మంచి ఆట‌గాడ‌ని చెప్పిన కైఫ్ రోహిత్ ఆట త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పాడు. బౌల‌ర్‌కు కూడా తెలియ‌కుండానే రోహిత్ అటాకింగ్ మొద‌లువుతుంద‌ని కైఫ్ అన్నాడు. ఓ స్పోర్ట్స్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కైఫ్ ఇలాంటి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Related News