logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

కడక్ నాథ్ కోళ్లు.. ధర తెలిస్తే షాకే.. వీటికి ఎందుకింత గిరాకీ?

కథక్ నాథ్ కోడి.. ఇప్పుడు ఈ పేరు మరోసారి సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని కడక్ నాథ్ కోళ్ల వ్యాపార మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఓ రైతు దగ్గర నుంచి ఈ 2 వేల కోళ్లకు ఆర్డర్ పెట్టాడు. అయితే ధోని ఈ వ్యాపారాన్ని ఎంచుకోవడం వెనుక చాలానే కారణాలు ఉన్నాయి. కడక్ నాథ్ కోళ్ళది ఓ ప్రత్యేక జాతి. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నల్ల కోళ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.

వీటిని ఆదివాసీ జాతికి చెందినవిగా పీలుస్తారు. ఒకప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్,గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇవి దొరికేవి. ఆదివాసీలు, గిరిజనులు, కొండజాతి వారు మాత్రమే ఈ జాతి కోళ్లను పెంచేవారు. కానీ వీటి ప్రత్యేకతల వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కోళ్లకు డిమాండ్ పెరుగుతుంది. పోషకాల్లోనే కాదు పోషించినవారిని ఆదుకోవడంలోనూ ఇవి ముందున్నాయి. కడక్ నాథ్ కోళ్లకు రోగనిరోధక శక్తి అధికంగా అంటుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఇవి తట్టుకోగలవు. దీంతో వీటిని పెంచిన వారికి ఆదాయాల పంట పండుతుంది. ఈ కోడి మాంసం కిలో వెయ్యి పైమాటే. ఒక గుడ్డు రూ. 50 వరకు ఉంటుంది. వీటిలో అంత స్పెషాలిటీ ఏముంది? అంటే ఈ కోడి పేరు, రూపం దగ్గర్నుంచి అన్నీ ప్రత్యేకతలే.

అంతేకాదు ఈ కోడిలో అరుదైన ఔషధ లక్షణాలు ఉండటం వల్ల వీటిని అనేక రకాల చికిత్సలతో ఉపయోగిస్తుంటారు. అందుకే మాంసాహార ప్రియులతో పాటుగా ఆరోగ్య రాయుళ్లను కూడా ఈ కోడి విపరీతంగా ఆకర్షిస్తుంది. ముదురు నలుపు, ముదురు నీలం రంగుల్లో ఉండే కడక్నాథ్ కోళ్లలో వెంట్రుకలు, చర్మం, మాంసంతో పాటు రక్తం కూడా నల్లగానే ఉంటుంది. ఈ జాతి కోట్లలో పొదుగుడు లక్షణం తక్కువ. ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. వేసవిలో సుమారు 100 గుడ్లు పెడుతుంది. 7 నెలల వ్యవధిలో ఈ కోడి కేవలం 1.5 కేజీల బరువు మాత్రమే పెరుగుతుంది.

ఈ కోడి రూపం లాగానే మాంసం కూడా బొగ్గులా ఉంటుంది. దీనితో ఎలాంటి ఆహారం వండినా నల్లగానే మారుతుంది. రంగు ఎలా ఉన్నా ఈ కోడి మాంసం తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. ఈ కోడిలో కొవ్వు శాతం చాలా తక్కువ ఉంటుంది. దీని మాంసంలో 18 రకాల అమినో యాసిడ్స్, విటమిన్లు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నికోటిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇందులోని ఔషధ గుణాలపై సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరు వారు ప్రత్యేక పరిశోధనలు చేసిన అనంతరం వెల్లడించారు. హైదరాబాద్ లోని నేషనల్ రీసెర్చ్ సెంట్రల్ ఆన్ మీట్ నివేదిక సైతం ఇదే విషయాన్ని తేల్చింది.

ఈ కోళ్ల రక్తాన్ని దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడానికి, మూలికా వైద్యంలోనూ ఆదివాసీలు ఉపయోగిస్తారు. హోమియో వైద్యంలోనూ నరాల సంబంధిత వ్యాధులు, ఇతర రోగాలను నయం చేయడానికి వీటిని వాడుతారు. ఈ కోడి మాంసం గుండె సంబంధిత రోగులకు మంచి ఆహారంగా చెప్తారు. గుండెకు రక్త సరఫరాను పెంచుతుంది. ఈ కోడి మాంసం, రక్తంలో వయాగ్రాలో ఉండే సిల్డెనాఫిల్‌ సిట్రిక్ అనే పదార్థం ఉండటం వలన సెక్స్ సామర్థ్యం పెంచుతుంది. మహిళల్లో అధిక రక్తస్రావం, గర్భస్రావం, ప్రసవానంతరం వచ్చే సమస్యలను కూడా దూరం చేస్తుంది.

Related News