logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మాజీ క్రికెటర్ మర్డర్ మిస్టరీ వీడింది.. కుమారుడే నిందితుడు!

మాజీ క్రికెటర్ కె. జయమోహన్ తంపి(64) హత్య కేసును పోలీసులు చేధించారు. సోమవారం ఉదయం జయమోహన్ తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు జయమోహన్ కుమారుడు అశ్విన్ ను నిందితుడిగా తేల్చారు. మొదటి నుండి ఈ కేసులో అశ్విన్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. అనంతరం అతనిని అదుపులోకి తీసుకుని విచారించి నిజాన్ని రాబట్టారు.

జయమోహన్ అతని కుమారుడు అశ్విన్ కు ఇంట్లో కలిసి మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో జయ మోహన్ హత్యకు గురైన రోజు(శనివారం) కూడా వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. మద్యం అయిపోవడంతో తండ్రి జయమోహన్ డెబిట్ కార్డు ఉపయోగించడానికి అశ్విన్ ప్రయత్నించాడు అందుకు జయమోహన్ ఒప్పుకోలేదు. ఈ విషయంపై తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ చెలరేగింది.

కోపంతో తండ్రిని ఒక్కసారిగా పక్కకు తోసాడు అశ్విన్. అప్పటికే మద్యం మత్తులో ఉన్న జయమోహన్ తలకు గాయమై మరణించాడు. ఆ తరువాత తండ్రి శవం పక్కనే కూర్చుని అశ్విన్ మద్యం సేవించాడు. అక్కడే నిద్రపోయాడని పోలీసులు వెల్లడించారు. 1979-82 సమయంలో జయమోహన్ కేరళ తరపున 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లను ఆడారు.

Related News