logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

బాలయ్య పై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష నేడు 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. కరోనా కారణంగా ఆయన తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తన అభిమానులకు కూడా ఆయన ఇదే విషయాన్ని సూచించారు.

కాగా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ తో తనకున్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే.నాకు ఊహ తెలిసాక చూసిన మొట్ట మొదటి హీరో మీరే. ఈ 60వ పుట్టిన రోజు మీ జీవితంలో మరుపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాబాయ్.. మీ 60వ పుట్టిన రోజు సందర్భంగా నా శుభాకాంక్షలు. జై బాలయ్య’ అంటూ బాబాయ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక వీరి మధ్య ఉన్న అనుబంధానికి నందమూరి అభిమానులు ముచ్చట పడుతున్నారు.

Related News