logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

”డియర్ జెన్నిఫర్..” అంటూ ప్రేయసి పై ఎన్టీఆర్ ట్వీట్!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రేయసిగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఒలీవియా పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి క్యూట్ లుక్ ను విడుదల చేసారు సినిమా యూనిట్.

అయితే ఈ లుక్ పై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ”డియర్ జెన్నిఫర్ హ్యాపీ బర్త్ డే” అంటూ ఆమెకు పుటిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ నుంచి ఆమె పాత్ర పేరును పరిచయ చేసారు. కాగా ఈ ట్వీట్ ఇప్పుడు ట్రేండింగ్ గా మారింది. కాగా అప్పటి వరకు ఏమాత్రం పరిచయం లేని ఒలీవియా మోరిస్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలియగానే ఎక్కడ లేని ఫాలోయింగ్ పెరిగిపోయింది.

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియాలో ఒలీవియాని ఫాలో కావడం మొదలు పెట్టడంతో ఆమె ఇంస్టాగ్రామ్ కు ఫాలోవర్ల వరద పోటెత్తింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తో పాటుగా శ్రియ శరన్ కూడా నటిస్తుంది. కాగా ఈ సినిమాను అక్టోబర్ 13 న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు మూవీ మేకర్స్.

Related News