logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

ఆగిపోయిన ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల సినిమా? అసలేం జరిగింది?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఆగిపోయింది. ఈ వార్త యంగ్ టైగర్ అభిమానులకు షాకిచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలె హస్తిన’కు అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత వీరిద్దరి కాబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ తాజాగా అందితున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు బ్రేకులు పడ్డట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా కథపై మొదటి నుంచీ ఎన్టీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడట. ఇప్పటికే దీనిపై రెండు మూడు వర్షన్లను త్రివిక్రమ్ వినిపించగా అవేవీ ఎన్టీఆర్ కు నచ్చడం లేదట. దీంతో ఈ సినిమాను ప్రస్తుతానికి పక్కనపెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. అటు ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా తర్వాత ఆ రేంజ్ లో ఉండే కథలోనే నటించాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడని అందుకే పాన్ ఇండియా లెవల్లో కథ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ కు సూచించాడట.

మరో విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కోసం మరో కథ సిద్ధం చేసే గ్యాప్ లో ఈ కథను త్రివిక్రమ్ మహేష్ బాబుకు వినిపించి ఒకే చేయించే ప్రయత్నాల్లో ఉన్నాడట. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. ‘ఖలేజా’ సినిమా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎలాంటి సినిమా రాలేదు. దీంతో త్రివిక్రమ్ మహేష్ తో సినిమాపై ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక వేళ ఈ వార్త నిజమైతే గనుక ఎన్టీఆర్ కోసం రాసిన కథను మహేష్ ఒకే చేస్తాడా? ఇంతకీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల సినిమా అసలు ఉంటుందా? అనే సందేహాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి.

 

Related News