logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

భార్య పుట్టినరోజుకి ఎన్టీఆర్ ఊహించని గిఫ్ట్..

జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతిల వివాహమై అప్పుడే తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మార్చి 18 న ఎన్టీఆర్ సతీమణి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. తనకు భార్యంటే ఎంత ప్రేమో పలు సందర్భాలలో వెల్లడించాడు తారక్. ఇప్పుడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఊహించని గిఫ్ట్ ఇచ్చి మరోసారి తన ప్రేమను చాటుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన అర్థాంగి కోసం ఓ పెద్ద ఫార్మ్ హౌస్ ను కొనుగోలు చేసి ఆమె పేరిట రాయించాడట ఎన్టీఆర్.

దీని విలువ భారీగానే ఉంటుందట. అనంతరం లక్ష్మి ప్రణతి పుట్టినరోజు వేడుకలు కూడా ఈ కొత్త ఫార్మ్ హౌస్ లోనే ఘనంగా జరిపించాడట. ఇక భర్త ఇచ్చిన బహుమతికి లక్ష్మి ప్రణతి ఎంతగానో సంతోషించిందని సమాచారం. 2011 లో ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతిలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీళ్లకు ఇద్దరు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ జన్మించారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మల్టి స్టారర్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుంటే.. రామ్ చరణ్ మాత్రం అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

Related News