టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త అవతారం ఎత్తాడు. సోషల్ మీడియా ద్వారా పెంచుకున్న పరిచయాలు నమ్మి దారుణంగా మోసపోతున్న యువతీయువకుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టించారు.
అందుకు యూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారకర్తగా ఎంచుకున్నారు. ప్రేమ పేరుతో వేసే వలలో పడొద్దంటూ పోలీసులు రూపొందించిన వీడియోను ఎన్టీఆర్ విడుదల చేసారు. ‘చెల్లెమ్మా నీకే చెప్తున్నా జాగ్రత్తగా ఉండు’ అంటూ యువతను హెచ్చరించారు.ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఆ తర్వాత మాయమాటలతో నంబర్లు మార్చుకోవడం వారి వ్యక్తిగత ఫోటోలను తీసుకుని బ్లాక్ మెయిల్ కు పాల్పడటం వంటి ఘటనలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ విధంగా అవగాహన కల్పిస్తున్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులు పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏదైనా సమస్య తలెత్తితే ధైర్యంగా పోలీసులను సంప్రదించాలంటూ జూనియర్ ఈ సందర్భంగా అవగాహనా కార్యక్రమం చేపట్టారు.
చెల్లమ్మా నికే చెప్తున నా మాట విను.
ఫేస్ బుక్ మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త. pic.twitter.com/GxVC9Zb6w2— Telangana State Police (@TelanganaCOPs) January 4, 2021