logo

  BREAKING NEWS

మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. 07.03.2021 బంగారం ధ‌ర  |   ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |  

నేను బాధితుడిని.. మీరు కావద్దు: జూనియర్ ఎన్టీఆర్!

మనం ఎంత జాగ్రత్తగా ఉన్న ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒకసారి మీ కుటుంబ సభ్యులను గురు తెచ్చుకోండి అంటూ హీరో జూనియర్ ఎన్టీఆర్ వాహనదారులను కోరారు. జాతీయ రహదారి భద్రత మహోత్సవం సందర్బంగా నేడు సైబరాబాద్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి రైల్వీస్ అడిషనల్ డీజీ సందీప్ శాండిల్య, సీపీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ నేను ఇక్కడికి నటుడిగా రాలేదు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయిన బాధితుడిగా వచ్చాను. ఈ ప్రమాదాల కారణంగా మా కుటుంబం ఇద్దరినీ కోల్పోయింది అని అన్నారు.

ఎప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండే మా అన్న జానకి రామ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రమాదం జరగకుండా 33 వేల కిలోమీటర్లు మా తాత ఎన్టీఆర్ ను నడిపిన మా నాన్న హరికృష్ణ ఇదే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారన్నారు. రోడ్డెక్కే ముందు మన కోసం ఇంట్లో ఎదురుచూసేవారిని గుర్తుచేసుకోవాలను వాహనదారులకు సూచించారు.

పోలీసులు ఉన్నది మనల్ని దండించడానికి కాదు, సరైన దారిలో నడిపించడానికి. మనకు మనం బాధ్యతగా వ్యవహరించినప్పుడే ఈ ప్రమాదాలను అరికట్టగలుగుతామని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. అనంతరం జెండా ఊపి పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు.

Related News