logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

బుల్లితెరపై ఎన్టీఆర్ కొత్త షో.. రెమ్యునరేషన్ విషయంలో రికార్డు!

హీరోగా తనకంటూ ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఒక్క సినిమాలకే పరిమితం కాకుండా బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాడు. గతంలో బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించాడు తారక్. తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని బిగ్ బాస్ కాన్సెప్ట్ ను ఇక్కడ సక్సెస్ చేయడమే కాకుండా ఈ షోని ఎంతో ఈజ్ తో నడిపించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తారక్ దెబ్బతో ఈ షో ఇప్పుడు విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకోబోతుంది. ఇదిలా ఉండగా ఈ యంగ్ టైగర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నాడు.

మొదట బిగ్ బాస్ అన్ని సీజన్లకు జూనియర్ హోస్ట్ గా ఉంటారని అంతా భావించారు. అది రూమరే అని తేలిపోయింది. ఒకవైపు సినిమా షూటింగ్లు మరోవైపు బిగ్ బాస్ కు ఎక్కువ ఎపిసోడ్లకు ఒకేసారి షూటింగ్ చేయవలసి రావడంతో కుటుంబానికి సమయం కేటాయించలేకపోయాడు తారక్. దీంతో మళ్ళీ బిగ్ బోస్ హోస్ట్ గా కనిపించలేదు. కానీ బుల్లితెరపై ఈసారి బిగ్ బాస్ కాకుండా ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాడట. ఎన్టీఆర్ ఆలోచన తెలిసిన జెమినీ టీవీ యాజమాన్యం ఆయనతో ఒక టాక్ షో చేయడానికి సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ తరహాలో కాకుండా ఈషోకి వారంలో రెండు గంటల సమయం కేటాయిస్తే సరిపోతుందని వారు చెప్పడంతో ఎన్టీఆర్ కూడా ఈ షోకి ఒకే చెప్పేశాడట. ఈ టాక్ షోను జెమిని టీవీ యాజమాన్యం భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

అందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో ఏకంగా రెండు ఫ్లోర్లను బుక్ చేశారట. ప్రస్తుతం రాజమౌళితో తెరకెక్కుతున్న ఆర్ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు తారక్. ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక తారక్ చేయనున్న సినిమా పట్టాలెక్కనుంది. పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గతంలో బాపు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమా ప్రేరణంగా తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం. చిరంజీవి నటించిన ఈ సూపర్ హిట్ సినిమాలోని ఒక లైన్ ను తీసుకుని ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారని టాక్ నడుస్తుంది. ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే అనే టైటిల్ ను పరిశీలనలో ఉన్నట్టుగా త్రివిక్రమ్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

అయితే కరోనా కారణంగా త్రివిక్రమ్ సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున ఈ గ్యాప్ లో జెమిని టీవీ నిర్వహించే టాక్ షో కోసం షూట్ ప్రారంభిస్తారని సమాచారం. అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ కు స్టార్ మా యాజమాన్యం భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసింది. అప్పట్లో కేవలం13 ఎపిసోడ్లకే 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు జెమిని ఛానెల్ లో ప్రసారమయ్యే టాక్ షో కోసం ఎన్టీఆర్ కు అందే రెమ్యునరేషన్ బుల్లితెరపై మరే నటుడు అందుకోనంత భారీగా ఉండబోతుందని సమాచారం. ఈ షో కోసం ఒక్క ఎపిసోడ్ కి ఎన్టీఆర్ కు రూ. 30 లక్షలు చెల్లించనున్నారట. దీంతో ఈ మొత్తం ఎపిసోడ్లకు కలిపి తారక్ రెమ్యునరేషన్ రూ.18 కోట్లకు పైగానే ఉండనుందని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది.

 

 

Related News