బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఇవాళ లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసును కోర్టు కొట్టి వేసింది. మొత్తం నిందితులందరూ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. బాబ్రీ మసీదును పథకం ప్రకారం కూల్చివేసినట్లు ఆధారాలు ఏవీ లేవని కోర్టు స్పష్టం చేసింది. బీజేపీ కురువృద్ధులు ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, ఉమాభారతి సహా మొత్తం 32 మంది నిందితులు నిర్దోషులని కోర్టు తీర్పు చెప్పింది.
1992 డిసెంబర్ 6న కరసేవకులు అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చి వేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపి 48 మందిపై అభియోగాలు మోపింది. కేసు విచారణ దశలో ఉన్నప్పుడే వీరిలో 17 మంది మరణించారు. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించి సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. మొత్తం 2000 పేజీల జడ్జిమెంట్ కాపీని చదివారు.