logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

గంజాయి స్మగ్లర్ల చేతిలో జర్నలిస్టు దారుణ హత్య..!

తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గంజాయి స్మగ్లర్ల చేతిలో ఓ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. తమిళన్ అనే టీవీ ఛానెల్ లో రిపోర్టర్ గా పని చేస్తున్న మౌసస్ ఇటీవల గంజాయి స్మగ్లింగ్, అక్రమ భూదందాలపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాడు. అందుకు సంబందించిన వరుస కథనాలను ప్రసారం చేసాడు.

దీంతో స్మగ్లర్లు మౌసస్ కు ఫోన్ చేసి కాంచీపురంలోని పుండ్రత్తూరుకు రావాలని పిలిచారు. అక్కడకు వెళ్లిన మౌసస్ పై స్మగ్లర్ల గ్యాంగ్ కత్తులతో దాడి చేసారు. మృతుడి శరీరంపై 18 కత్తిపోట్లు పడటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. మరెవరైనా ఇలాంటి పనులు చేస్తే వారికి కూడా ఇదే గతి పడుతుందంటూ స్మగ్లర్లు హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Related News