logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

జో బైడెన్ జీవితంలో ఎన్నో అవమానాలు, విషాదాలు

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించబోతున్నారు జో బైడెన్. ప్రజాస్వామ్యవాదిగా, అన్ని వర్గాల ప్రజలకు అనుకూలుడిగా ఆయనకు పేరుంది.1942 నవంబర్ 20న పెన్సిల్వేనియాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగారు. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలిగే ధైర్యాన్ని చిన్నతనంలోనే నేర్పారు. బైడెన్ 36 సంవత్సరాలు సెనెటర్ గా రెండు సార్లు అమెరికా ఉపాధ్యక్షుడిగా పని చేసారు. అయితే బైడెన్ జీవితంలో ఎన్నో అవమానాలు, విషాదాలు ఉన్నాయి. ఎన్ని ఓటములు ఎదురైనా అన్నిటినీ దాటుకుంటూ చివరకు 77 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

బైడెన్ రాజకీయ జీవితంపై ఆయన వ్యక్తిగత విషాదాలు ఎంతో ప్రభావం చూపాయి. చిన్న తనంలో బైడెన్ కు మాటలు సరిగా పలికేవి కావట. దీంతో తోటి పిల్లలంతా తనను వెక్కిరించేవారు. ఆ తర్వాత ఆయన ఎంతో కాలం పాటు అద్దం ముందు నిల్చుని సాధారణంగా మాట్లాడే ప్రయత్నం చేసేవారట.

అలా కొన్ని రోజులకు అనుకున్నది సాధించారు. పెద్దయ్యాక న్యాయ విద్యను పూర్తి చేసిన బైడెన్ కోర్టు హాలులో అనర్గళంగా అతని వాదనను వినిపించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరిచేవారు. 29 ఏళ్ల వయసులోనే సెనెటర్ గా ఎంపికైన బైడెన్ బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. బైడెన్ సిరాక్యూస్ యూనివర్సిటీలో చదువుతున్న నీలియా హంటర్ను 1966లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

అప్పటికే ఆయన డెమాక్రాటిక్ పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరికి ముగ్గురు సంతానం. 1972 లో మొదటి సారి సెనెటర్ గా ఎంపికైన కొద్ది రోజులకే ఆయన వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు ప్రమాదంలో ఆయన భార్య నీలియా, ఏడాది వయసున్న కూతురు అమీని పోగొట్టుకున్నారు.

మరో ఇద్దరు కుమారులు సురక్షితంగా బయటపడ్డారు. వారిని చూసుకుంటూ ప్రత్యేక అనుమతుల నడుమ ఆసుపత్రి నుంచే సెనెటర్ గా ప్రమాణ స్వీకారం చేసారు. 1977 సమయంలో రాజకీయాలతో క్షణం తీరికలేకుండా గడుపుతున్న బైడెన్ కు జిల్ ట్రేసీ జాకబ్స్ అనే టీచర్ పరిచయమయ్యారు. ఆమెను వివాహం చేసుకుంటానన్న ప్రతిపాదనను జిల్ ఏకంగా 5 సార్లు తిరస్కరించారట. ఆమెకు అంతకుముందే వివాహం జరిగి విడిపోగా మరోసారి బైడెన్ పెళ్లి ప్రతిపాదనను ఒప్పుకోలేదు. చివరగా ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు జిల్ బైడెన్ అమెరికా మొదటి మహిళ కాబోతున్నారు. తన విజయం వెనుక జిల్ పాత్ర చాలా ఉందని బైడెన్ చెప్తుంటారు.

 

Related News