logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

ఐటీ నిపుణులకు భారీ ఊరట… ట్రంప్ నిర్ణయాన్ని తిప్పికొట్టిన బైడెన్!

భారతీయులకు నూతన అధ్యక్షుడు జో బైడెన్ భారీ శుభవార్తను వినిపించారు. హెచ్ 1 బీ వీసాదారులకు సంబంధించి బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలో హెచ్ 1బీ వీసా పొందే వారిపై కనీస వేతన పరిమితి అమలును నిలిపివేస్తున్నట్టుగా కార్మిక శాఖ ఓ నోటిఫికేషన్ ను జారీ చేసింది. జూన్ 1వతేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానున్న నేపథ్యంలో మరో 60 రోజుల పాటు వాయిదా వేసే దిశగా బైడెన్ ఉన్నారని సమాచారం.

బైడెన్ తాజా నిర్ణయం అమెరికాకు హెచ్ 1బీ వీసాలపై వెళ్లేవారికి, ప్రస్తుతం అక్కడ ఉద్యోగం చేసే భారతీయులకు భారీ ఊరటనిస్తోంది. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికన్లను మెప్పించేందుకు కనీస వేతనాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసారు. సాధారణంగా హెచ్ 1బీ వీసా పొందాలంటే వారి కనీస వార్షిక వేతనం 65 డాలర్ల కన్నా ఎక్కువ ఉండాలి.

అయితే ట్రంప్ హయాంలో దీనిని 1.10 లక్షల డాలర్లకు మార్చారు. అంటే 45 శాతాన్ని పెంచారు. దీని వల్ల విదేశీయులను నియమించుకునే కంపెనీలు వారి ఉద్యోగులకు అధిక వేతనాలు చెల్లించాల్సి వచ్చేది. ఈ విధంగా వేతనాల భారం తగ్గించుకునేందుకు కంపెనీలు విదేశీ ఉద్యోగుల స్థానంలో స్వదేశీయులనే నియమించుకుంటాయనేది ట్రంప్ వాదన.

అమెరికాలోని టెక్ కంపెనీలు ఏటా భారత్, చైనాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. దీంతో ఆ కంపెనీలన్నీ ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. మరోవైపు ప్రవాస భారతీయుల్లో కూడా దీనిపై ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు బైడెన్ నిర్ణయంతో ఐటీ నిపుణులకు భారీ ఊరట లభించింది. అయితే బైడెన్ నిర్ణయాన్ని ఫెడరేషన్‌ ఫర్‌ అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ రిఫార్మ్‌(ఫెయిర్‌) సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిబంధనను నిలిపివేయడం వల్ల ఇప్పటికే కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న అమెరికన్లు పరిస్థితి మరింత క్షీణిస్తుందని వ్యాఖ్యానించింది.

Related News