logo

  BREAKING NEWS

మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల!  |  

భారత్ లో జో బైడెన్ బంధువులు.. ఎక్కడున్నారంటే?

ట్రంప్ పై భారీ ఆధిక్యంతో అమెరికా అధ్యక్ష పీఠాన్ని గెలుపొందారు జో బైడెన్. త్వరలోనే ఆ దేశానికి 46వ అధ్యక్షడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ గురించిన ఓ ఆసక్తికర విషయం తెలిసింది. బైడెన్.. తన పూర్వీకుల మూలాలు భారత్ లో ఉన్నాయని తెలిపి షాకిచ్చారు. అంతే కాదు తనకు భారత్ లో బంధువులు కూడా ఉన్నారన్నారు.

ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హ్యారిస్ భారత మూలాలు కలిగిన మహిళ అని తెలిసిందే. కాగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కాబోతున్న బైడెన్ కూడా భారత్ తో తనకున్న సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 2013 లో ఉపాధ్యక్షుల రేసులో ఉన్న బైడెన్ తన పర్యటనలో భాగంగా ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు.

తమ పూర్వికులు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కొనసాగుతున్న సమయంలో భారత్ లో పనిచేసేవారని, ఆ సమయంలో భారతీయ మహిళనే పెళ్లి చేసుకుని ఇండియాలో స్థిరపడ్డారని తెలిపారు. అయితే ఈ విషయం తనకు తన 29వ ఏటనే తెలిసిందన్నారు. తాను తొలిసారిగా సెనెటర్ గా ఎన్నికయ్యే సమయంలో తనకో లేఖ వచ్చిందని అన్నారు. పేరు చివర బైడెన్ అని ఉండటం అది తనకు ఇండియా నుంచి రావడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.

తన ముత్తాత అయిన జార్జ్ బైడెన్ ఈస్ట్ ఇండియాలో పని చేస్తూ అక్కడి మహిళను పెళ్లి చేసుకోవడం వలన తనకిప్పుడు ముంబైలో అయిదుగురు బంధువులు ఉన్న విషయం తెలుసుకున్నానన్నారు. ఆ లేఖ తనకు ఎంతో ప్రత్యేకమన్నారు. అయితే గతంలో బైడెన్ ఈ విషయం చెపుతూ.. భారత్ లో ఉన్న తన రక్త సంబంధీకులను గుర్తించి తనకు తెలపాలని కోరారు. కాగా ఇప్పటివరకు బైడెన్ ముంబైలో ఉన్న తన బంధువులను కలుసుకోలేకపోయారు.

Related News