logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన జీవిత..

టాలీవుడ్ సినీయర్ హీరో రాజశేఖర్ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనతో పాటుగా అయన కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకింది. వారంతా కరోనా నుంచి కోలుకున్నా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళన కరంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఆయన సతీమణి జీవిత మరోసారి అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.

రాజశేఖర్ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉన్నట్టుగా తెలిపారు. అయితే శరీరంలో ఇన్ఫెక్షన్ కారణంగా అయన చాలా క్రిటికల్ స్టేజ్ వరకు వెళ్లారన్నారు. ప్రస్తుతం అయన కరోనా నుంచి కోలుకుంటున్నారని త్వరలోనే ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నారని జీవిత తెలిపారు. రాజశేఖర్ ఆరోగ్యం పై వస్తున్న వార్తలతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో జీవిత మరోసారి క్లారిటీ ఇచ్చారు.

వైద్యులు అనుక్షణం ఆయనను కనిపెట్టుకుని ఉంటున్నారని ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా ఆయనకు వైద్యం అందుతుందన్నారు. రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు జీవిత ధన్యవాదాలు తెలిపారు.

Related News