logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు ఫ్రీ!

జియో తమ యూజర్లకు అదిరిపోయే వార్త వినిపించింది. ఇప్పటికే వివిధ ఆఫర్లతో తమ వినియోగదారులను ఆకట్టుకుంటున్న జియో ఇపుడు మరో అద్భుతమైన ప్లాన్ ను తీసుకొచ్చింది. ఏడాది పాటు తమ ప్రీపెయిడ్ యూజర్లకు డిస్ని, హాట్ స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ను ఉచితంగా అందించనున్నట్టుగా ప్రకటించింది. అయితే అందుకు కొన్ని షరతులు వర్తింపజేయనుంది.

ముందుగా యూజర్లు రూ.401 మంత్లీ రీచార్జి ప్లాన్‌, రూ.2,599 వార్షిక ప్లాన్‌, రూ.612, రూ.1208 డేటా వౌచర్లు.. ఇలా వీటిలో ఎదో ఒక ప్లాన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీరికి మాత్రమే ఈ ఆఫర్ ను వర్తింపజేస్తారు. సోషల్ మీడియాలో ఈ ప్లాన్ కు విపరీతమైన స్పందన వస్తుండటంతో వివరాలతో కూడిన సమాచారాన్ని జియో విడుదల చేసింది.

అయితే ఇదివరకే జియో ఫైబర్ బ్రాండ్ యూజర్లకు అమెజాన్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ను ఉచితంగా అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా తమ యూజర్లకు డిస్ని, హాట్ స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ను ఉచితంగా అందిస్తుండటంతో జియో ఎయిర్టెల్ కు పోటీగా ఈ ప్లాన్ ను ప్రవేశపెట్టింది.

Related News