దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జెస్సికా లాల్ హత్య కేసులో హంతకుడు మను శర్మకు జైలు శిక్ష నుండి విముక్తి లభించింది. 1999 ఏప్రిల్ 30న ఓ ప్రైవేటు బార్ లో పని చేస్తున్నఉత్తరప్రదేశ్ కు చెందిన మోడల్ జేస్సికా లాల్ ను అత్యంత దారుణంగా హత్య చేసాడు మను శర్మ. అర్థరాత్రి 2 గంటల సమయంలో తనకు మద్యం సర్వ్ చేయాలనీ కోరగా సమయం ముగిసిందని జెస్సికా లాల్ అందుకు ఒప్పుకోలేదు.
దీంతో మను శర్మ కోపం కట్టలు తెంచుకుంది. తన దగ్గర ఉన్న గాన్ తో జెస్సికాను పాయింట్ బ్లాంక్ లో గాన్ పెట్టి కాల్చి చంపాడు. మను శర్మ మాజీ కేంద్ర మంత్రి వినోద్ శర్మ కుమారుడన్న విషయం తెలిసిందే. మను శర్మకు 2006 లో యావజ్జేవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. రెండు సంవత్సరాలుగా సత్ప్రవర్తన కలిగి ఉన్న కారణంగా జైలు సాధికారులు అతనిని పే రోల్ పై బయటకు వెళ్లి పనిచేసుకోవడానికి అనుమతినిచ్చారు.
2018 లో జెస్సికా లాల్ సోదరి సబ్రినా లాల్ అతడు సత్ప్రవర్తన కలిగి ఉన్నందున అతనిని విడుదల చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జైళ్ల శాఖకు లేఖ ద్వారా తెలిపారు. కానీ అత్యంత హేయమైన నేరం చేసినందుకు గాను అతనిని విడుదల చేసేందుకు కోర్టు అనుమతించలేదు. అనేక నాటకీయ పరిణామాల అనంతరం సెంటెన్స్ రివ్యూ బోర్డు సిఫార్సు మేరకు వివిధ నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతినిచ్చారు. ఈ మేరకు సోమవారం రోజున మను శర్మతో పాటుగా మరో 18 మంది ని అధికారులు విడుదల చేసారు.