logo

జేసీకి 14 రోజుల రిమాండ్.. కుమారుడితో సహా అనంతపురం జైలుకు..

153 బస్సులకు సంబంధించి నకిలీ ఎన్ఓసీ పత్రాలను సృష్టించి అక్రమాలకు పాల్పడ్డ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అతని కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కేసు విషయమై మూడు గంటల పాటు విచారించారు.

అనంతరం వారిని కోర్టు ముందు హాజరు పరచగా.. న్యాయమూర్తి ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు అనంతరం ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అనంతపురం జైలుకు తరలించారు. మాజీ పార్లమెంటు సభ్యుడిగా , తాడిపత్రి ఎమ్మెల్యేగా పని చేసిన ప్రభాకర్ రెడ్డి బిఎస్ 3 వాహనాలను బిఎస్ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించి అమ్మకాలు సాగించారని తేలడంతో వీరిద్దరిని పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్ మీద 24 కేసులు, తాడిపత్రి పోలీస్ స్టేషన్లో 27 కేసులు నమోదయ్యాయి.

Related News