logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

చంద్ర‌బాబుకు షాకిచ్చిన జేసీ.. ఇలా చేస్తే ఎవ‌రూ న‌మ్మ‌రట‌

విద్యుత్ బిల్లుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పెంచింద‌నే కార‌ణంతో ఇవాళ 12 గంట‌ల దీక్ష‌ల‌కు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆయ‌న పిలుపుమేర‌కు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఇళ్ల‌లో, పార్టీ కార్యాల‌యాల్లో దీక్ష‌ల‌కు దిగారు. ఇదిలా ఉండ‌గా విద్యుత్ బిల్లుల‌పై త‌మ పార్టీ వారు చేస్తున్న దీక్ష‌లు వృధానే అని టీడీపీ నేత‌, మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఇంట్లో ఉండి దీక్ష చేస్తే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్పందిస్తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

 

అస‌లు తెలుగుదేశం పార్టీ నేత‌లు దీక్ష‌లు ఎందుకు చేస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని, టీడీపీ నేత‌ల‌కు కూడా ఎందుకు దీక్ష‌లు చేస్తున్నారో తెలియ‌ద‌న్నారు. ఇంట్లో దీక్ష‌లు చేయ‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని జేసీ పేర్కొన్నారు. ఇంట్లో ఉండి దీక్షలు చేస్తే ఎవ‌రు న‌మ్ముతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అమ‌రావ‌తిలో 158 రోజులుగా దీక్ష‌లు చేస్తుంటే ఒక్కరైనా స్పందించారా అని అడిగారు. వైసీపీ వాళ్ల‌దే రాజ్యం కాబ‌ట్టి తెలుగుదేశం వాళ్ల‌పై దాడులు చేస్తున్నార‌ని చెప్పిన జేసీ జ‌గ‌న్‌ది రాక్ష‌స రాజ్యంగా పోల్చారు.

 

ఇదిలా ఉండ‌గా పోతిరెడ్డిపాడు విష‌యంలో మాత్రం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని దివాక‌ర్‌రెడ్డి స‌మ‌ర్థించారు. రాయ‌ల‌సీమ‌కు నీరందించేందుకు జ‌గ‌న్ చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తున్నార‌ని కితాబిచ్చారు. క‌రువు ప్రాంతాల‌కు నీరు త‌ర‌లించేందుకు జ‌గ‌న్ ప‌ని చేస్తున్నార‌ని పేర్కొన్నారు. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి జీవో తెచ్చిన జ‌గ‌న్‌కు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. పోతిరెడ్డిపాడు కోసం వైఎస్సార్ చాలా కృషి చేశార‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి గుర్తు చేశారు.

Related News