logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

‘జాతిరత్నాలు’ సినిమా రివ్యూ.. హిట్టా.. ఫట్టా?

శివరాత్రి సందర్భంగా విడుదలవుతున్న సినిమాలలో ‘జాతి రత్నాలు’ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా అనూప్ కేవీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించాడు. మరి ఈ సీనియా ఎలా ఉందొ రివ్యూలో తెలుసుకుందాం..

కథ:
జీవితంలో ఎదగాలనే ఆశయంతో హైద్రాబాద్ నగరానికి వచ్చే నవీన్, రాహుల్ రామకృష్ణన్, ప్రియదర్శిలు అనుకోకుండా ఓ మర్డర్ కేసులో ఇరుకోవలసి వస్తుంది. లోకల్ ఎమ్మెల్యేలేని చంపేందుకు ప్రయత్నించారనే కేసులో వీరు ముగ్గురు జైలుకు వెళ్తారు. మామూలుగానే అల్లరి చిల్లరగా తిరిగే ఈ హీరోలు జైలుకు వెళ్లి అక్కడి పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారు? చిట్టి ఎవరు? అసలు వీళ్ళపైకి ఆ మర్డర్ కేసు ఎలా వచ్చింది? చివరకు ఈ కేసు నుంచి ఎలా బయట పడ్డారు అనేదే సినిమా కథ.

విశ్లేషణ:
జాతి రత్నాలు సినిమా టీజర్, ట్రైలర్ లు సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేసాయి. ‘చిట్టి నీ నవ్వుంటె’ అనే పాటతో చిన్నపాటి సంచలనమే సృష్టించింది ఈ సినిమా టీమ్. ఇక రివ్యూ విషయానికొస్తే.. ఈ వేసవిలో ఎంటర్ టైన్మెంట్ ను కోరుకునేవారికి జాతి రత్నాలు సినిమా బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఫస్ట్ హా లో నవీన్, ప్రియదర్శి, రాహుల్ ల కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ముగ్గురు హీరోలు అద్భుతంగా నటించారు. అయితే నవీన్ పోలిశెట్టి నటన సినిమాలో మరో హైలెట్.

చిట్టి పాత్రలో ఫరియా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ రైడర్ గా సాగుతుంది. అయితే సినిమాను పూర్తిగా వినోదభరితంగా మార్చేయాలనే ప్రయత్నంలో కథలో సీరియస్ నెస్ ను పక్కనపెట్టాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ పై ఇంకొంచెం శ్రద్ధ పెడితే సినిమా రిసల్ట్ మరో స్థాయిలో ఉండేదనే టాక్ వినిపిస్తుంది. అయితే సినిమా లో లాజిక్కులుపక్కన పెడితే వినోదం కోరుకునే వారిని జాతిరత్నాలు సినిమా అస్సలు డిసప్పాయింట్ చేయదనే చెప్పాలి. యూత్ జాతిరత్నాలు సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేస్తారనే విషయంలో సందేహం లేదు. ఇక మిగిలిన ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఓసారి చూసేయొచ్చు.

ప్లస్ పాయింట్స్ :
జాయతిరత్నాలు సినిమా లో నవీన్ పోలిశెట్టి నటన, కామెడీ టైమింగ్, యూత్ కి కనెక్ట్ అయ్యే స్టోరీ లైన్ ఇవన్నీ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్, రియాలిటీకి దగ్గరగా లేని కొన్ని సన్నివేశాలు మాత్రం ఈ సినిమాకు మైనస్ గా చెప్పుకోవాలి.

రేటింగ్:
మొత్తంగా జాతిరత్నాలు సినిమాకు 3.5 రేటింగ్ ఇవ్వచ్చు.

Related News