logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

బుమ్రా పెళ్లి చేసుకోబోయేది అనుపమను కాదట.. ఈ అమ్మాయినే!

టీమ్ ఇండియా పేస్ సంచలన ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఇండియా- ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఆడకపోవడం, అదే సమయంలో సొంత రాష్ట్రమైన గుజరాత్ కు సెలవులపై వెళ్లడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. అయితే నిజంగానే బుమ్రా ఓ ఇంటి వాడు కాబోతున్నాడని సమాచారం. మార్చి 14 వ తేదీన గోవాలో బుమ్రా వివాహం అత్యంత సన్నిహితుల మధ్య జరగనుందని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా అసలు బుమ్రాకు కాబోయే భార్య ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో రాశి ఖన్నాతో ఈ ఆటగాడు ప్రేమలో ఉన్నాడని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత సౌత్ ఇండియన్ హీరోయిన్ అనుమప పరమేశ్వరన్ ను బుమ్రా పెళ్లి చేసుకోనున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ వార్తలను అనుపమ తల్లి ఖండించారు. వీరిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడు బుమ్రా కాబోయే భార్య అంటూ ఓ ముద్దు గుమ్మ తెరపైకి వచ్చింది ఆమె ఎవరో కాదు. ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్. సంజనా ఐపీఎల్ కోల్ కతా నైట్ రైడర్స్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఆమెతోనే బుమ్రా ఏడడుగులు వేయనున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తుంది. వీరిద్దరికి సంబందించి మీమ్స్ ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇదే సమయంలో సంజనా తన ఉద్యోగానికి కొంత కాలం సెలవు తీసుకోవడంతో బుమ్రాతో పెళ్లి వార్తలు నిజమనే తేల్చేస్తున్నారు నెటిజన్లు. ఈ వార్త గనుక నిజమైతే ఈ టీమిండియా పేసర్ ఇంగ్లాండ్ తో టీ ట్వంటీకి దూరమవుతాడనే వార్తలు వస్తున్నాయి. 2021 లో ఐపీఎల్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Related News