టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. అందులో భాగంగా తన సొంత రాష్ట్రమైన గుజరాత్ కు చేరుకున్నాడు. పెళ్లి పనుల్లో బిజీగా గడుపుతున్నాదాని సమాచారం. గోవాలో జరుగుతున్న ఈ పెళ్ళికి అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సహచరులు మాత్రమే ఆహ్వానించనున్నారు. పెళ్లి తర్వాతా జరిగే గ్రాండ్ రెసెప్షన్ కి మాత్రం టీమిండియా ఆటగాళ్లు, ప్రముఖులు హాజరుకానున్నారట. అయితే ఈ యువ ఆటగాడు పెళ్లి చేసుకోబేయేది ఎవరిననే విషయం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది.
తాజాగా బుమ్రా పెళ్లిపై ఇప్పుడు మరో వార్త వైరల్ గా మారింది. బుమ్రా పెళ్లాడేది ఎవర్నో కాదు మన టాలీవుడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ నే అని ఈ వార్తల సారాంశం. అయితే ఈ వార్తలను పూర్తిగా రూమర్లని కొట్టి పారేయలేం. ఎందుకంటే కొంతకాలంగా వీరిద్దరూ చనువుగా ఉంటున్న ఇషయం తెలిసిందే. బుమ్రా ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరోయిన్ అనుపమనే. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఇటీవల బాహాటంగానే ప్రకటించాడు.
అంతే కాదు బుమ్రా గుజరాత్ లో ఉండగా అనుపమ కూడా గుజరాత్ కు పయనమవ్వడం అందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి ఈ వార్తలపై మరిన్ని అనుమానాలు కలుగజేస్తున్నాయి వారి అభిమానులకు. బుమ్రా పెళ్లిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తన చర్చ నడుస్తుంది. అయితే అతను పెళ్లి చేసుకోబోయేది ఎవరనే విషయం తేలియాలంటే మరికొన్ని రోజు ఆగాల్సిందే.