logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

నిద్రలేమి, ఇన్సులిన్ సమస్యతో బాధపడేవారు ఈ టీ తాగిచూడండి

గ్రీన్ టీ , జింజర్ టీ, మసాలా టీ లాంటివన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. కానీ మల్లెపూలతో చేసిన టీ వల్ల ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. కాలానుగుణంగా పూచే పూలలో మల్లె పువ్వు కూడా ఒకటి. ఇవి రాత్రిపూట మాత్రమే పోస్తాయి. అందుకే వీటిని సాయంకాల సమయంలో కోస్తారు. పరిమళాన్ని వెదజల్లే ఈ పూలతో వివిధ సుగంధ ద్రవ్యాలు, నూనెలను తయారు చేస్తారు. మల్లె పూలు మనలో ఉన్న నిస్సహాయతను పోగొట్టి విశ్వాసాన్ని పెంచుతుంది. వీటితో తయారు చేసిన టీని జపాన్, ఆఫ్రికా దేశాలలో అధికంగా వినియోగిస్తారు. ఆరోగ్యానికి మేలు చేసే న్యూట్రీషియన్స్ తో పాటుగా ఈ జాస్మిన్ టీ లో ఫాలీఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మనషికి కావలసిన ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. జాస్మిన్ టీని తాగడం వలన ఆరోగ్యానికి కలిగే 15 అద్భుతమై ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

జాస్మిన్ టీలో ఉండే యాంటిసెప్టిక్ లక్షణాల కారణంగా ఇవి బ్యాక్టీరియా, క్రిములపై చాలా ఎఫక్టీవ్ గా పనిచేస్తాయి. అంతే కాదు ఇంధులో ఉండే కొన్ని ప్రత్యేక ఔషధ గుణాల కారణంగా ఇన్ఫెక్షన్ను నివారించడంలో ఉపయోగపడతాయి. అందుకే వీటిని సౌందర్య ఉత్పత్తుల్లో కూడా అధికంగా ఉపయోగిస్తారు. క్రమం తప్పకుండా ఈ టీని తీసుకోవడం కారణంగా మొహంపై ఉండే మచ్చలు, గాయాలతో పాటుగా మొటిమలు కూడా తగ్గిపోతాయి. స్కిన్ ఎలాస్టిటిని తగ్గించి ముడతలు రాకుండా చేస్తుంది. సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. క్యాన్సర్ కు కారణమయ్యే కణాలతో పోరాడుతుంది. జాస్మిన్ టీ గుండె సమస్యలను దూరం చేస్తుంది. గుండె వేగంగా కొట్టుకునే సమస్యను తగ్గించుకోవచ్చు. తరచుగా మూడీగా అనిపించడం, అలసట, నిరాశ నిస్పృహలతో సతమతమవుతున్నవారు ఈ జాస్మిన్ టీని కచ్చితంగా తీసుకోవాలి.

ఇది మీ మైండ్ ను రిలాక్స్ చేసి ఒత్తిడిని దూరం చేస్తుంది. గుండె పోటు రిస్క్ ను గణనీయంగా తగ్గించగలదు. కొలెస్ట్రాల్ ను అదుపు చేసి స్ట్రోక్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా శరీర బరువు కూడా అదుపులో ఉంచుకోవచ్చు. మెటబాలిజం రేటును పెంచి ఒబెసిటీ సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలో జీవ క్రియలను సక్రమంగా పనిచేసే విధంగా చేస్తుంది. నిద్రలేమి సమస్యకు కూడా ఇది బెస్ట్ ట్రీట్ మెంట్. ఇంకా మంచి ప్రయోజనాలు పొందాలనుకునేవారు జాస్మిన్ టీని గ్రీన్ టీతో కలిపి తీసుకోవడం చాలా మంచిది. షుగర్ వ్యాధి అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి ఇది న్యాచురల్ రెమెడీ.

శరీరంలో బ్లడ్ షుగర్ ను క్రమబద్దీకరించి ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ఉన్నవారికి ఇది చాలా మంచి ఔషధం. పొట్ట సమస్యలను నివారించడంలోనూ ఇది బాగా పనిచేస్తుంది. జాస్మిన్ టీలో ఉండే స్మూతింగ్ గుణాలు జీర్ణాశయాన్ని ఇబ్బంది పెట్టె సమస్యలను దూరం చేస్తాయి. మానసిక సమస్యలకు ఇది మంచి ముందుగా పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ వైరల్ గుణాల కారణంగా జలుబు, ఫ్లూను తగ్గిస్తుంది. శ్వాస సమస్యలను దూరం చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, కండరాల నొప్పులను తగ్గించుకోవడానికి కూడా జాస్మిన్ టీని డైట్ లో చేర్చుకోవచ్చు.

Related News